కృష్ణసాయి హీరోగా ‘జ్యువెల్ థీఫ్’ టీజర్ లాంచ్ !

కృష్ణసాయి – మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న ‘జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు న‌టించారు.

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జ‌రిగిన ‘జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడియో లాంచ్ వేడుక‌లో చీఫ్ గెస్టుగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీఐజీ అనిల్ మింజ్, మరో చీఫ్ గెస్టు ఏపీ, తెలంగాణ ఇన్కమ్  టాక్స్ కమీషనర్ IRS ఆఫీసర్ జీవన్ లాల్ లవిదియ, మరో గెస్టు న‌టీ ఎస్త‌ర్ పాల్గొని చిత్ర టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ… నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాను. ‘జ్యువెల్ థీఫ్’  ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది.

పృథ్వి మాట్లాడుతూ… నేను, అలాగే కృష్ణ సాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. హీరోగా ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో యాక్షన్ పార్టులతో పాటు అద్భుతంగా నటించాడు.  నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

పీఎస్ నారాయణ మాట్లాడుతూ… నా మీద నమ్మకంతో త‌న‌తో సినిమా చేయ‌మ‌ని కృష్ణసాయి వచ్చారు. ఆయనకు తగ్గ కథను పది రోజుల్లోనే పూర్తి చేశాను. సినిమా నటీనటులు, చిత్ర యూనిట్ అందరు బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, పేరున్న సీనియర్ నటీనటులు ఇందులో ఉన్నారు. అంద‌రిని ఆక‌ట్టుకునే సినిమా ఇది.

మిమిక్రి శివారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు పూర్తి స్థాయి క్యారెక్టర్ ఇచ్చారు. దర్శకుడు మా అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండి సినిమా అద్భుతంగా పూర్తి చేశారు. శ్రీలేఖ అందించిన పాటలు బాగున్నాయి. కృష్ణసాయి గారికి అద్భుతమైన టాలెంట్ ఉంది.
న‌టి ప్రేమ మాట్లాడుతూ… నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ అంద‌రిని ఆకట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.
నటుడు ఆనంద చక్రపాణి మాట్లాడుతూ… నాకు ఇప్పటివరకు చేయని అద్భుతమైన క్యారెక్ట‌ర్‌ను దర్శకుడు ఇచ్చారు.  సినిమాపై అంచ‌నాలు పెరిగిపోవ‌డం ఖాయం. అలాంటి స‌బ్జెక్టు ఇది.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పీఎస్ నారాయణ
మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ, డీవోపీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్ : జేపీ, ఫైట్ మాస్టర్: రమణ, డాన్స్: స్వర్ణ, యాని,  లిరిక్ : కామేశ్వర్, పీఎస్ నారాయణ