ఎం ఏస్. కె ప్రమిద ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా తెలుగు సిల్వర్‌స్క్రీన్ పైకి ఓ సూపర్ లవ్ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతోంది. దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్ గౌడ్, యం.యస్.కె. రాజు నిర్మించిన ఈ సినిమా 17 న రిలీజ్ అవుతుంది.
కృష్ణ సాయి మాట్లాడుతూ… ‘‘ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 17 న విడుదల చేస్తున్నాం అన్నారు. కృష్ణసాయి, మౌర్యాని కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్, సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాకుండా రామోజీఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ అని అన్నారు. మా ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం.. అని తెలిపారు.
జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మ్యూజిక్: సిద్ధబాబు, కెమెరా: వెంకట్ హనుమాన్
కొరియోగ్రాఫర్ : నిక్సన్ పాల్ ,సూర్య కిరణ్ ,అనీష్ ,రవి కృష్ణ
ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాతలు: బీసు చందర్ గౌడ్ – MSK రాజు