వియాన్ జీ అంగారిక సమర్పణలో గురు దాత క్రియేటివ్ వర్క్స్ పతాకంపై విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘు దీప్ నటీ నటులుగా సుధీర్ దర్శకత్వంలో విశ్వజిత్, గీతా కౌషిక్ నిర్మించిన “కౌశిక వర్మ దమయంతి” చిత్రం విడుదలకు సిద్దమయ్యింది .దమయంతి అనే రైటర్ కౌషిక్ వర్మను వశం చేసుకోవడానికి ఆమె చేసిన విశ్వ ప్రయత్నం విఫలం అవ్వడంతో తను ఇచ్చిన శాపం ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్న కథ. ఈ చిత్రంలో హేమచంద్ర పాడిన “పదరా పదరా వేటకు వెళ్దాం” పాటను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చేతులమీదుగా రిలీజ్ చేశారు.
సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “కౌశిక వర్మ దమయంతి సినిమాకు యస్. యస్ ఆత్రేయ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. హేమచంద్ర పాడిన “పదరా పదరా వేటకు వెళ్దాం” పాట చాలా బాగుంది. ఈ సినిమాకు విశ్వజిత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చాలా కష్టపడి తీశారు.ఈ సినిమా ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర హీరో, నిర్మాత విశ్వజిత్ మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చింది.200 ఇయర్స్ బ్యాక్ స్టోరీ, ప్రెజెంట్ స్టోరీ లతో తెరకెక్కిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇందులో ఉన్న నాలుగు పాటలు చాలా బాగుంటాయి. పాతకాలపు సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
చిత్ర దర్శకుడు సుధీర్ మాట్లాడుతూ.. అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.గోవాలో షూట్ చేసుకున్న “పదరా పదరా వేటకు వెళ్దాం” సాంగ్ ను సి.కళ్యాణ్ గారు విడుదల చేశారు చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మా సినిమాకు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు
నటుడు రఘు దీప్, కొరియోగ్రాఫర్ జిన్నా, కో డైరెక్టర్ లక్ష్మణ్ ఉదురుకోట, నటుడు ఆగస్తిన్, మేనేజర్ సాయికిశోర్ సోనే తదితరులు మంచి సబ్జెక్టు తో వస్తున్న ఈ సినిమా.. బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.