రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా నంది క్రియేషన్స్ పతాకం పై కె.యండి. రఫీ. రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”.ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ లాంచింగ్ గ్రాండ్ గా రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి ఛైర్మన్ అంబికా కృష్ణ గారు, సురక్ష కంపెనీస్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ పద్మజ మానేపల్లి గారు పాల్గొన్నారు.అంబికా కృష్ణ గారు ట్రైలర్ ను లాంచ్ చేయగా, పద్మజ మానేపల్లి గారు ఆడియో సిడి లను విడుదల చేశారు,
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో అంబికా కృష్ణ మాట్లాడుతూ… ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో పాటలతో పోల్చుకుంటే బంగారి బాలరాజు సినిమాలోని అన్ని పాటలు చాలా బాగున్నాయి. కొత్తవారైన సంగీత దర్శకులు చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు చాలా చక్కని సంగీతాన్ని అందించారు. అలాగే ట్రైలర్ చాలా బాగా వచ్చింది. ఈ ట్రైలర్ చూడగానే నాకు అర్ధమైంది డైరెక్టర్ కోటేంద్ర ఎంత కష్టపడ్డారో. ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. హీరో రాఘవ్ కు మంచి భవిష్యత్తు ఉంది. అని టీం కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చిన్న సినిమాలు నిర్మించేవారికి ఒక వరాన్ని ప్రకటించారు. అదేమిటంటే 4 కోట్ల లోపు నిర్మించే ప్రతి చిత్రానికి 10 లక్షల రూపాయల సబ్సిడితో పాటు పన్నురాయితీ కూడా ఉంటుంది. సినిమా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలి. ఈ విషయాన్నిఅంబికా కృష్ణ గారు బంగారి బాలరాజు వేదిక మీద ప్రకటించడం గమనార్హం.
దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ… ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా అంబికా కృష్ణ గారు రావడం చాలా ఆనందంగా ఉందని, వారికి ప్రత్యేక కృతజ్ఞలు తెలియజేశారు. సినిమా బాగా వచ్చిందని బంగారి బాలరాజు సినిమా అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుందని త్వరలో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలియజేశారు.
నిర్మాతలు కె.యమ్ డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ బంగారి బాలరాజు సినిమా ట్రైలర్ ను అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ చిత్రం ఖచ్చితంగా అందరిని అలరిస్తుందని అన్నారు.