కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నివేక్ష (నమ్రతా దరేకర్)లతో బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌లు నిర్మించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’. మార్చి 4న విడుదలవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను సామాజిక మద్యమమైన ట్విట్టర్ ద్వారా సెన్సేనల్ హీరో విజయదేవరకొండ విడుదల చేశారు.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ కు ధన్యవాదాలు.ఇందులో ప్రతి సెటప్ కూడా చాలా కొత్తగా ట్రై చేశాము. సిద్దారెడ్డి,రాజు, ప్రమోదు గార్లు నాకు బాగా సపోర్ట్ గా నిలిచారు. బాలాజీ గారు నాకు రేచీకటి ఉన్న కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ సినిమా చెయ్యడం జరిగింది. రేచీకటి ఉన్న మనిషి లైఫ్ ఎలా ఉంటుందని బాలాజీ గారు చాల బాగా చూపించారు. జిబ్రాన్ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ‘సెబాస్టియన్ పిసి524’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమా చూశాము అనే ఫీలింగ్ తో బయటికి వస్తారు అన్నారు.
దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ కంటే సినిమా చాలా బాగుంటుంది. కథ రాసుకున్నప్పుడే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యి రాసుకున్నాను. దీనికి తగ్గట్టు జిబ్రాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రేచీకటి పెర్ఫార్మన్స్ డీల్ చేయడం చాలా కష్టం.కానీ ఈ సినిమాలో కిరణ్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ చేసాడు. మదనపల్లె లో 32 రోజుల్లో ఈ సినిమా చేయడం జరిగింది. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన కిరణ్ కు ,నిర్మాతలకు, ధన్యవాదాలు అన్నారు.
నిర్మాతలు సిద్దారెడ్డి, రాజు, ప్రమోద్ లు మాట్లాడుతూ.. ‘రాజావారు రాణి గారు’ తో ప్రేక్షకులను అలరించి, ‘యస్.ఆర్. కళ్యాణమండపం’ తో ప్రభంజనం సృష్టించిన కిరణ్ అబ్బవరం తన మూడో చిత్రంలో రేచీకటి కాన్సెప్ట్ ను ఛాలెంజ్ గా తీసుకొని చక్కని నటనను ప్రదర్శించాడు. ఆద్యంతం అలరించే పట్టువదలని కథ, కథనంతో బాలాజీ చాలా చక్కగా తెరకెక్కించాడు. జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.పాటలకు,టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.మా టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. కిరణ్, నివేక్ష లు చాలా.చక్కగా నటించారు. రెండున్నర గంటల సేపు అందరినీ కట్టిపడేసే కథనంతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది.చూసిన వారందరికీ మా సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.