‘కె.జి.యఫ్’ తో దేశమంతా సంచలం సృష్టించి.. ఘన విజయాన్ని సాధించిన యష్ ‘కె.జి.యఫ్-2’ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా ‘కె.జి.యఫ్-2’ గురించి యష్ చెప్పిన విశేషాలు …
#‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ కూడా రికార్డులను క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారా?
‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ సినిమా స్టార్ట్ చేసే ముందు మాకు చాలా పరిమితులుండేవి. అయితే ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఎంతో కష్టపడి సినిమాను రూపొందించాం. ఆ తపనే ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించే దిశగా మమ్మల్ని నడిపించింది. ఓ టీమ్‌లా మేం పడ్డ కష్టానికి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీల నుండి చాలా గొప్ప స్పందన వచ్చింది. ఇప్పుడు మా సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. దాంతో టీమ్ అందరం ఇంకా కష్టపడ్డాం. ఇంకా బిగ్ స్కేల్లో ‘కేజీయఫ్ ఛాప్టర్2’ సినిమాను రూపొందించాం. ఇంత కష్టపడటానికి కారణం.. ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేసేలా ఓ సినిమాను రూపొందించడానికే. ఈ ప్రాసెస్‌లో ఏవైనా రికార్డులు బ్రేక్ కావడం వంటివి జరిగితే మాకు అది బోనస్.
#‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ కి ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’కి ఉన్న తేడా ఏంటి?
‘కేజీయఫ్ ఛాప్టర్ 1’లో రాకీ భాయ్ పాత్రను పరిచయం చేశాం. అతను ఎక్కడి నుంచి వచ్చాడు. తన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. తన ముందున్న రాక్షసులను దాటి లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే అంశాలను చూపించాం. ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’లో ఇప్పటి వరకు రాకీ భాయ్‌లో చూడని మరికొన్ని కోణాలను ఆవిష్కరించబోతున్నాం. ఈ రెండో భాగం తొలి భాగం కంటే ఎమోషనల్‌గా, యాక్షన్ సమ్మిళతంగా ఉంటుంది
#‘కేజీయఫ్ ఛాప్టర్ 2’లో ఏమైనా సర్ప్రైజ్లు ప్లాన్ చేశారా?
ఉన్నాయండి.. అయితే ఇప్పుడే చెప్పలేను. చెప్పేస్తే అందులో సర్ప్రైజ్ ఏముంటుంది.
#సంజయ్ దత్, రవీనాటాండన్‌లతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి..?
సంజయ్ దత్, రవీనాటాండన్ గారితో కలిసి పనిచేయడం గొప్ప ఫీలింగ్. సంజయ్దత్గారు ఆరోగ్యం బాగా లేకపోయినా వర్క్‌పై ఆయనకున్న ప్యాషన్, వృతిపట్ల ఆయనకున్న అంకితభావం అన్నీ చూస్తే ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇక రవీనాటాండన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆమె విలక్షణ నటి. ఆమె టీమ్ జాయిన్ కాగానే ఆమె శక్తిని యూనిట్‌కు అందించింది. వీరిద్దరితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది.
#‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
– ఈ పాత్రలో దాదాపు నాలుగేళ్లుగా ఉన్నాననే చెప్పాలి(నవ్వుతూ). పాత్ర కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. సహజ సిద్ధంగానే చేశాను.
#‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ లో ఏ సీక్వెన్స్ మీకు ఛాలెంజింగ్‌గా అనిపించింది?
– సినిమాలో చాలా ఎగ్జయిటింగ్, ఛాలెంజింగ్ సన్నివేశాలున్నాయి. ఏదో ఒకదాని గురించి నేను చెప్పలేను. సినిమా రిలీజైతే మీకు సమాధానం కనిపిస్తుంది.