కీర్తి సురేష్ ఎన్ని ఆఫర్లు వెల్లువెత్తినా సరైన చిత్రాలను ఎంపిక చేసుకొంటూ జాగ్రత్తగా అడుగులేస్తున్నారు . అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన ‘మహానటి’ తర్వాత కీర్తీ సురేష్ కెరీర్ గ్రాఫ్ ఉవ్వెత్తున ఎగిసింది. కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలయాళంలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత సురేష్ కుమార్, తమిళ నటి మేనక కుమార్తె. తన తండ్రి 2000లో నిర్మించిన చిత్రం ‘పైలెట్’ ద్వారానే బాలనటిగా కెరీర్ ఆరంభించారు. కీర్తీ సురేష్ తండ్రి ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు. ఇటీవల ప్రముఖ బిజెపి నేత కుమారుడితో పెళ్లి కీర్తి అనే వార్తలను కీర్తి కుటుంబం ఖండించింది.
కీర్తి సురేష్‌కు విలాసవంతమైన కార్లు అంటే చాలా ఇష్టం. ఆమె వద్ద ఉన్న అతి ఖరీదైన కారు జాగ్వర్ ఎక్స్ జే. దాని ఖరీదు 1.03 కోట్లు. ఈ కారు మాత్రమే కాకుండా కీర్తి సురేష్ వద్ద ఫోర్ట్ మోడల్, స్కోడా, మెర్సిడెజ్ బెంజ్, ఆడి కారు ఉన్నాయి. ఇక చెన్నై, కేరళలో కొన్ని ఖరీదైన భవనాలు ఆమె పేరిట ఉన్నట్టు సమాచారం. కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతంటే ఇక దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కీర్తీ సురేష్ చేతిలో భారీ, క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మలయాళంలో ‘మరక్కర్’, తెలుగులో ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్ దే’, తమిళంలో ‘అన్నాతే’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ప్రతీ సినిమాకు కోటి పైగా పారితోషికం అందుకొంటున్నట్టు సమాచారం. సురేష్ 20 ఏళ్ల కెరీర్లో వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తి భారీగానే ఉందనే విషయం ఆర్థిక నిపుణులు అంచనా. రెండు దశాబ్దాల కాలంలో ఆమె దాదాపు 30 సినిమాల్లో నటించారు. ఈ కాలంలో ఆమె వ్యక్తిగత సంపద 2020 నాటికి 15 కోట్లు దాటిందని అంచనా వేశారు.
జూన్ 19న అమెజాన్‌లో ‘పెంగ్విన్’
కీర్తీ సురేష్ నటించిన’పెంగ్విన్ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. జూన్ 19న పెంగ్విన్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ, కరోనా పరిస్థితుల కారణంగా 19వ తేదీనే ‘అమెజాన్’లో రిలీజ్ చేసేందుకు సిద్ధపడ్డారు. ఈథ్రిల్లర్ ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఓ నిర్మాత. ఇందులో గర్భవతి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు.
కెరీర్లో ‘మ్యాజికల్ మైల్స్టోన్’ చేరుకున్నా!
కెరీర్లో ‘మైల్స్టోన్’ అని చెప్పుకునే అవకాశాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ‘మహానటి’ రూపంలో కీర్తీ సురేష్ కెరీర్లో ఓ మంచి మైల్స్టోన్ వచ్చింది. నటిగా సినిమా సినిమాకీ ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళుతోన్న కీర్తి ఇప్పుడు తన కెరీర్లో ‘మ్యాజికల్ మైల్స్టోన్’ చేరుకున్నానని అంటున్నారు. మరి.. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అవకాశం అంటే.. ఏదో మ్యాజిక్ జరిగినట్లే కదా!. రజనీ 168వ సినిమా ‘అన్నాతే’ లో కీర్తీకి ఈ చాన్స్ దక్కింది. ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ‘‘రజనీకాంత్ సార్ సరసన నటించడం అనేది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంలాంటిది. నా సినిమా కెరీర్లో ఇదొక ‘మ్యాజికల్ మైల్స్టోన్’’ అన్నారు కీర్తీ సురేష్.