కీర్తీసురేశ్ ఫొటోలు కొన్నిసామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కీర్తీసురేశ్ బాగా చిక్కిపోయినట్లు కనిపిస్తోంది. కీర్తీ ‘చాలా తక్కువ కాలంలో నటిగా ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి’ అన్నది తెలిసిందే. సాధారణంగా మొదట్లో కమర్శియల్ చిత్రాల్లో చాలా తేలికైన పాత్రల్లో నటించాలని చాలా మంది కోరుకుంటారు. అదే విధంగా వర్ధమాన నటీమణులను నమ్మి ఏ దర్శక నిర్మాత బరువైన పాత్రలను ఆఫర్ చేయడానికి సాహసించరు.చాలా మంది హీరోయిన్లు మొదట్లో గ్లామర్ పాత్రలు వేసి… ఆ తర్వాత హీరోయిన్ ప్రధాన కథా చిత్రాలు చేస్తారు. అలాంటిది కీర్తీసురేశ్‌కు మొదట్లోనే అలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ కథ చిత్రాల అవకాశాలు తలుపు తట్టడం ఆమె అదృష్టమనే చెప్పాలి.
లక్కీగా కీర్తీకి అలాంటి పాత్ర ‘మహానటి’ రూపంలో వరించింది. ఈ సినిమాలో నాటి మేటి నటి సావిత్రిగా ఆమె నటించడాన్ని కొందరు పరిహసించారు కూడా.అయినా దర్శకుడి సూచనలతో కీర్తీసురేశ్ తన పనిని సమర్థవంతంగా చేసింది. ‘సావిత్రి పాత్ర అంటే కీర్తీసురేశ్‌నే చేయాలి’ అనేంతగా పేరు తెచ్చుకుంది. అయితే కీర్తీ అంతకుముందు ‘రజనీమురుగన్’, ‘రెమో’ వంటి కమర్శియల్ చిత్రాల్లో నటించి సక్సెస్ అయ్యింది. ‘మహానటి’ చిత్రం తరువాత కీర్తీసురేశ్ స్థాయి పూర్తిగా మారిపోయింది. ఇప్పటి తన ఇమేజి కి తగ్గట్టుగానే కీర్తీ ప్రస్తుతం కథలను ఎంచుకుంటోంది
బొద్దుగా ఉంటే అంగీకరించరు !
కీర్తి ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో కథానాయకి ప్రధాన చిత్రం లో నటిస్తోంది. దీనికి నరేంద్రనాథ్ దర్శకుడు. దీనితో పాటు మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది.అంతే కాదు ఇప్పుడు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. లక్కీగా తొలి హిందీ చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేస్తున్నాదన్నప్రచారం జరుగుతోంది. అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో కథానాయికల్ని బొద్దుగా ఉంటే అంగీకరించరు. అందుకే దక్షిణాదిలో పాపులర్ అయిన కథానాయికలు బాలీవుడ్‌కెళితే స్లిమ్ కావలసిందే.నటి తమన్నా, కాజల్‌అగర్వాల్, ఇలియానా వంటి వారు బాలీవుడ్‌లో అవకాశం వస్తే ముందుగా చేసే పని బరువు తగ్గడం. ఎంతగా అంటే… ‘జీరోసైజ్’ అంటారే అంతగా. నటి తాప్సీ కూడా బరువు బాగా తగ్గడం వల్లే బాలీవుడ్‌లో పాగా వేయగలిగింది. ఇప్పుడు నటి కీర్తీసురేశ్ అందుకు కసరత్తులు చేయక తప్పలేదు. నిజానికి కీర్తీది ఏమంత భారీ కాయం కాదు. అయినా ఇంకా బరువు తగ్గాల్సిన పరిస్థితి. అక్కడి వారి అభిరుచి అంతే. అందుకనుగణంగా కీర్తీ మారిపోయింది.