కత్రినా కైఫ్… బాలీవుడ్‌లో టాప్ సెలబ్రిటీలు అందరు ఇటీవల వరుసగా పెళ్ళి పీటలెక్కారు. ముందుగా సోనమ్ కపూర్ తన ప్రియుడిని వివాహం చేసుకోగా, ఆ తర్వాత దీపికా పదుకొణే , ప్రియాంక చోప్రా ఇలా ఒకరి తర్వాత ఒకరు తమకి నచ్చిన వారితో ఏడడుగులు వేసారు. ఈ ఏడాది కూడా కొందరు భామలు మూడు ముళ్ళు వేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న కత్రినా కైఫ్ తనని ఒంటరిని చేసి వివాహాలు చేసుకోవద్దని తోటి నటీమణులని రిక్వెస్ట్ చేస్తోంది.
కొద్ది రోజులుగా ఛలోక్తులతో వార్తలలో నిలుస్తూ వస్తున్న కత్రినా కైఫ్ ని… బాలీవుడ్‌లో వరుసగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అని అడిగితే కత్రినా స్పందిస్తూ…
“అందరు పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉంది. కాని నన్ను ఒంటరిని చేసి వివాహాలు చేసుకోవద్దు” అంటూ ఫన్నీగా బదులిచ్చింది కత్రినా. హీరోయిన్ చమత్కారానికి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.”నువ్వు తొందరగా వివాహం చేసుకో” అంటూ సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్న ఈ అమ్మడు సినిమాలతో బిజీ అయింది. ఇటీవల ‘జీరో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కత్రినా ప్రస్తుతం ‘భారత్’ సినిమాలో సల్మాన్ సరసన నటిస్తుంది.
నరకయాతనను అనుభవించా !
తెరపై అద్భుతంగా ప్రేమను పండించే కొందరు నిజ జీవితంలో కూడా ప్రేమలో పడుతుంటారు… అది కొందరి సినీ జీవితాలనే కాకుండా వ్యక్తిగత జీవితాలపై సైతం తీవ్ర ప్రభావం చూపింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినాకైఫ్ సైతం ప్రేమలో విఫలమై చెప్పడానికి వీలుకాని బాధను అనుభవించిందట. ముందుగా కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌తో ప్రేమలో పడ్డ ఈ భామ… ఆ బంధం తెగిపోయాక ఆ బాధ నుంచి విముక్తి కావడానికి చాలా కష్టపడింది. అనంతరం మరో హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమను పంచుకున్న కత్రినాకు అతని నుంచి కూడా విడిపోక తప్పలేదు. ఈసారి మాత్రం తను ఎంతో నరకయాతనను అనుభవించానని చెప్పింది ఈ భామ. అయితే ఆ వేదన నుంచి బయటపడడానికి వ్యాయామాన్ని ఆసరాగా తీసుకున్నానని… ఒక్కోసారి అతిగా వ్యాయామం చేసేదాన్నని, అప్పుడే ఆ బాధను మరచిపోయేదాన్నని పేర్కొంది. రణబీర్‌తో తన బ్రేకప్, అనంతరం పరిణామాలు వంటి విషయాలపై కత్రినా ఇటీవల మాట్లాడింది….
“ప్రేమలో బ్రేకప్ తర్వాత ఎక్కువగా జిమ్‌కు వెళ్లేదాన్ని. వ్యాయామంపై ఎక్కువగా దృష్టి పెట్టేదాన్ని. అతిగా కసరత్తులు చేసేదాన్ని. నా కలల గురించి… భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించేదాన్ని. వ్యాయామం వల్ల క్రమశిక్షణతో పాటు, మానసిక బలం కూడా పెరిగింది. క్రమంగా నేను ఆ బాధ నుంచి తేరుకొని కెరీర్‌పై తిరిగి దృష్టిపెట్టగలిగాను”అని కత్రినా పేర్కొంది