కార్తికేయ హీరోగా నటించిన `గుణ 369` ఆగస్టు 2న విడుదల కానుంది. అనఘ ఇందులో నాయిక. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పిస్తున్న చిత్రమిది. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. అర్జున్ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.
చిత్ర సమర్పకురాలు ప్రవీణ కడియాల మాట్లాడుతూ ``మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు… అని సాయికుమార్ గంభీరమైన స్వరంతో చెప్పే మాటలతో `గుణ 369` టీజర్ ను ఇటీవల విడుదల చేశాం.చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా తప్పకుండా ప్రజలకు నచ్చుతుందనే నమ్మకం ఉంది“ అని అన్నారు.
దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “తెలుగులో మంచి కథలతో సినిమా రావట్లేదని చాలా మంది అంటుంటారు. మా `గుణ 369` చూసిన తర్వాత ఇంకెప్పుడూ ఎవరూ అలాంటి మాటలు అనరు. అంతగా అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అప్రమత్తంగా చేస్తున్నాం“ అని చెప్పారు.
నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ “ యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలతో మేం నిర్మించిన చిత్రం `గుణ 369`. షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను, ట్రైలర్ను విడుదల చేసి, ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సర్వం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటిదాకా వచ్చిన ఔట్పుట్ చాలా బావుంది. ప్రేక్షకులకు అన్నివిధాలా నచ్చుతుందని నమ్మకం కలిగింది“ అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్, కెమెరామెన్: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సత్య కిశోర్, శివ మల్లాల.