కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ నాయికగా తెరకెక్కిన చిత్రం `గుణ 369`. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రమిది. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. గురువారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి .
నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ “ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది . ఆగస్ట్ 2న చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం . మంచి సినిమా చేశామని సంతృప్తి మాలో ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు.ఇప్పటికే పాటలకు ఎక్సట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తొలి పాటను స్టార్ ప్రొడ్యూసర్ `దిల్`రాజు, రెండో పాటను ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం, అలీ,మూడో పాటను దర్శకేంద్రులు కే రాఘవేంద్ర రావు విడుదల చేశారు. అలాగే ట్రైలర్ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను ఆవిష్కరించారు “ అని అన్నారు.
దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “నాలుగ్గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది“ అని అన్నారు.
సాంకేతిక నిపుణులు
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్,
కెమెరామెన్: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్,
ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్,ఎడిటర్ : తమ్మిరాజు ,డాన్స్ : రఘు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సత్య కిశోర్, శివ మల్లాల.