కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘దేవ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రాజత్ రవిశంకర్ ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దేవ్ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా దేవ్ ఆడియోను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిక్కి గిర్లానీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. చెన్నై, హిమాలయాస్, హైదరాబాద్, ముంబైలోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు దర్శకుడు రజత్. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా.. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ దేవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది.
నటీనటులు:
కార్తి, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నిక్కీ గిర్లానీ, కార్తిక్ ముత్తురామన్, ఆర్జే విఘ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: రజత్ రవిశంకర్
నిర్మాతలు: S లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు
నిర్మాణ సంస్థలు: ప‌్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్
సమర్పణ: రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్
సంగీతం: హరీష్ జయరాజ్,సినిమాటోగ్రఫీ: వేల్రాజ్
ఆర్ట్: రాజీవన్,ఎడిటర్: రూబెన్,విఎఫ్ఎక్స్: హరిహరసుధన్