‘ఖైదీ’ లాంటి సినిమా చేసే అవకాశం ఒక్కసారే వస్తుంది!

కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. తెలుగులో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ దీపావళి కానుకగా అక్టోబర్ 25న అందిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో కార్తీ ఇంటర్వ్యూ…
 
డెఫినెట్ గా మీకు నచ్చుతుంది
– లోకేష్ కనకరాజ్‌ షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండస్ట్రీ కి వచ్చి ఫస్ట్ మూవీ తోనే చాలా పెద్ద హిట్అందుకున్నారు. ‘ఇదొక కొత్త ఐడియా’ డెఫినెట్ గా మీకు నచ్చుతుంది.ఒకసారి వినండి.. అని చెప్పారు. సినిమా మొత్తం మాస్ గా యాక్షన్ కూడా ఎక్కువే ఉంటుంది. ఒక రాత్రి నాలుగు గంటల్లో ఈ సినిమా జరుగుతుంది. చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని ఒక భారీ బడ్జెట్ సినిమాగా తీస్తే.. తప్పకుండా సక్సెస్ అవుతుంది అనిపించింది.
 
ఇదొక బిగ్ యాక్షన్ ఫిలిం
– నా క్యారెక్టరైజేషన్ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం. పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బైటికి వచ్చే ఒక ‘ఖైదీ’ . అతనికి ఇప్పటివరకూ చూడని ఒక కూతురు ఉంటుంది. తను ఎలా ఉంటుందో కూడా తెలీదు. అన్ని అవాంతరాలని దాటుకొని కూతురిని చూడగలిగాడా? అనేది కథ. పది సంవత్సరాలు తన కూతురిని చూడలేదు అంటే.. నాకు కూడా పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉంటుంది అనిపించింది.ఇదొక బిగ్ యాక్షన్ ఫిలిం.
 
ఛాలెంజింగ్ అనిపించిన సందర్భం
– నేను గతంలో ‘విక్రమార్కుడు’ మూవీ ని తమిళ్ లో రీమేక్ చేసేటప్పుడు.. నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని నటించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య ఏమి లేదు కాబట్టి అంతా హ్యాపీ గానే జరిగింది.నాకు ఒక కూతురు ఉండడం వల్ల నాన్నగా నటించడం ఈజీ అయింది.
 
ట్రైలర్ లో డైలాగ్స్ కి రెస్పాన్స్
– ట్రైలర్ లో చూపించింది చాలా తక్కువ. రేపు సినిమాలో డైలాగ్స్ కి మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రతి సీన్ ఫ్రెష్ గా …సినిమా ఒక న్యూ ఏజ్ యాక్షన్ ఫిలిం లా ఉంటుంది, కానీ నా క్యారెక్టర్ మాత్రం మాస్ గా ఉంటుంది. ఇదొక యూనిక్ కాంబినేషన్. నేను ఎవరు? గతం ఏంటి ? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.ఈ సినిమాలో నాతో పాటు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫేమస్ ఆర్టిస్టులు నటించారు.
 
ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టాం
– ఇలాంటి ఒక మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నపుడు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టడమనేది న్యూ థాట్. అదీను ఒక హాలీవుడ్ మూవీలాగే మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో తప్పకుండా సరిపోయేంత థ్రిల్ ఉన్న కంటెంట్ ఉంది.
 
సాంగ్స్‌, రొమాన్స్‌ లేకుండా
– అలా అనేం లేదండి. తెలుగులో కూడా కొత్త కొత్త కథలతో థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి, ‘అర్జున్ రెడ్డి’, అడవి శేష్ స్టైలిష్ థ్రిలర్ ‘ఎవరు’ కూడా మంచి సక్సెస్ సాధించింది. అందులోను డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికీ చాలా దగ్గర అయింది. ఇలాంటి సందర్భం లో ఖైదీ లాంటి సినిమా చేసే అవకాశం ఒక్కసారే వస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేటప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చేయాలి అనుకున్నాను. సాంగ్స్‌, రొమాన్స్‌ లేకుండా కేవలం యాక్షన్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండే డిఫరెంట్‌ మూవీ ఇది.
 
నిజమైన ఖైదీలను కలిసాము
– ఈ సినిమాకు సంబంధించి మేము నిజమైన ఖైదీ లను కలవడం జరిగింది. డైరెక్టర్ వారిని కలిసినప్పుడు.. చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు. చాలా కాలం జైలు లో ఉన్న ఖైదీలు బయటకు వచ్చి ‘వైట్ కలర్ చూస్తే చాలా హ్యాపీ గా ఉంటుంది’ అని చెప్పారు.ఈ చిత్రం కోసం 60 రాత్రులు షూట్ చేశాం. ఈ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ విజయ్ గారితో సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకూ నేను చేసిన అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్.
 
ఫ్యామిలీ థ్రిల్లర్
– జీతూ జోసెఫ్ గారితో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ చేస్తున్నాను. దానిలో మా వదిన జ్యోతిక గారు కూడా నటిస్తున్నారు. చాలా మంచి కథ.