‘నేనిప్పుడు బాలీవుడ్ మెగాస్టార్‌ని. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నా సినీ కెరీర్ ఇప్పుడు ముగిసిపోయినా.. నేను నష్టపోయేది,కోల్పోయేది ఏం లేదు’ అని అంటోంది కంగనా రనౌత్. కంగనా బాలీవుడ్‌లోకి అడుగిడి పదకుండేళ్లు అవుతుంది. 2006లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసినప్పట్నుంచి ఇప్పటివరకు 28 చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
విమర్శకుల ప్రశంసలతోపాటు మూడు జాతీయ అవార్డులనూ కైవసం చేసుకుంది. ఈ జర్నీ గురించి కంగనా చెబుతూ….
‘ఇన్నేండ్ల కెరీర్లో భయాన్ని అధిగమించాను. వ్యక్తిగత విషయంలో నన్ను నేను తెలుసుకోవడం చాలా సంతృప్తిగా ఉంది. నా స్వభావం, నా ఆలోచనలు, ధోరణిలు, నా శక్తిసామర్థ్యాలేంటో తెలిశాయి. ఇంటి నుంచి వచ్చినప్పుడు నా వయసు 15 ఏండ్లు. ఇప్పుడు 30. ఈ 15 ఏండ్లలో నా గురించి చాలా విషయాలు తెలిశాయి. చిత్రపరిశ్రమలో ఉన్నత స్థానానికి చేరుకున్నా. మూడు జాతీయ అవార్డులందుకున్నా. నేనిప్పుడు బాలీవుడ్ మెగాస్టార్‌ని. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ఇప్పుడు నేను భయపడితే.. కెరీర్ మొత్తం భయపడాల్సి వస్తుంది’ అని తెలిపింది. ప్రస్తుతం ఆమె ‘సిమ్రాన్’, ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రాల్లో నటిస్తోంది.