ఆమె చేసిన రిస్క్ ఈమె కూడా చేస్తోంది !

“ఇప్పుడు ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న కథానాయిక సైతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేయగలిగే స్థాయికి వచ్చింది. గతంతో పోల్చితే మహిళా సాధికారత పెరుగుతోంది. మహిళా ప్రధానంగా సినిమాలొస్తున్నాయి. రెమ్యూనరేషన్‌ విషయంలో కొత్త మార్పులున్నాయి. అందుకు చాలా కారణాలున్నాయి. ఇప్పుడు ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న కథానాయిక సైతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేయగలిగే స్థాయికి వచ్చింది. ఇది ఆనందించాల్సిన పరిణామం” అని తెలిపింది కంగనా రనౌత్‌. మహిళా సాధికారతపై అవకాశం వచ్చినప్పుడల్లా గళం ఎత్తే ఆమె తాజాగా ‘కావేరి కాలింగ్‌’ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై తన అభిప్రాయం వెల్లడించారు… “ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను ముందుంటా”నని తెలిపారు.
 
ప్రస్తుతం ఆమె ‘పంగా’, ‘ధాకడ్‌’తో పాటు తమిళం, హిందీలో రూపొందే జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ లో నటించబోతుంది. అక్టోబర్‌ 15న సినిమా ప్రారంభం కానుంది.ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభంలోనే ఓ పాటని చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా రెట్రో స్టయిల్‌లో ఈ పాట సాగుతుంది. ఇందులో కంగనా పాల్గొననుంది. దీని కోసం ఆమె భరతనాట్యం కూడా నేర్చుకుంటుందట. దాదాపు వంద మంది డాన్సర్లతో ఈ పాటని చాలా గ్రాండియర్‌గా చిత్రీకరించాలని భావిస్తున్నారు. జయలలిత సినిమాల్లోకి రాకముందు పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆ అంశాలన్నీ ఈ బయోపిక్‌లో ఉంటాయట.
 
అదే రిస్క్‌ చేయడానికి సిద్ధం
సినిమా హీరోయిన్లు శరీరాకృతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లుక్‌ విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా అది కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. ‘సైజ్‌ జీరో’ సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క తరువాత లుక్‌ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ ఆమె నాజుకుగా మారలేకపోతోంది. అయితే తాజాగా మరో బ్యూటీ కంగనా అదే రిస్క్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు.
 
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ జయలలిత బయోపిక్‌లో నటించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జయలా కనిపించేందుకు ఆమె చాలా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్ నేర్చుకుంటున్న కంగనా, అదే సమయంలో బరువు కూడా పెరుగుతున్నారట.ఈ చిత్రం కోసం ఆమె పది కిలోల బరువు పెరుగుతున్నారట. ఒకసారి బరువు పెరిగితే తగ్గటం చాలా కష్టమని తెలిసినా.. అమ్మ పాత్రకు న్యాయం చేసేందుకు రిస్క్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారట కంగనా. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాలో ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి, కరుణానిధిగా ప్రకాష్‌ రాజ్‌ నటించనున్నారని తెలుస్తోంది.ఏ.ఎల్‌.విజయ్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి విష్ణు ఇందూరి నిర్మాత.