కంగనా రనౌత్ ‘మణికర్ణిక’… వేల సంఖ్యలో నటులు, నిజమైన ఆయుధాలు, భారీ స్టంట్స్…ఇవీ ‘మణికర్ణిక’ చిత్రం ప్రత్యేకతలుగా చెప్పవచ్చనని బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ పేర్కొంది. ఆమె టైటిల్ రోల్ పోషించిన చిత్రమిది. వీరవనిత ఝాన్సీలక్ష్మీబాయి జీవితం ఆధారంగా రూపొందిన సినిమాయే ‘మణికర్ణిక’. క్రిష్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ నిర్మించారు.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కంగనా మాట్లాడుతూ… 150 ఏళ్ల క్రితం నాటి ఆయుధాలనే ఈ సినిమా కోసం వాడామని చెప్పింది. ఇందులో ఉత్తమ యాక్షన్, వార్ సీక్వెన్లు అద్భుతంగా తెరకెక్కించామని పేర్కొంది. ”ఆ సమయంలో ఉపయోగించిన రైఫిల్స్ ఇప్పటి వారికి కొత్తగా అనిపిస్తాయి. అప్పట్లో బ్రిటిష్ ఆర్మీ ఇన్‌ఫీల్డ్ రిఫైల్స్ ఉపయోగిస్తే..రాణీ లక్ష్మీబాయి కత్తులు వాడారు. 150 ఏళ్ల క్రితం నాటి ఆయుధాలను ఈ సినిమాలో ఉపయోగించాం. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఆసక్తిగా ఉంటాయి. ఐదు కేజీల బరువు ఉన్న కవచం ఉపయోగించా. ఈ సినిమా షూటింగ్ కోసం తెల్లవారుజామున మూడు గంటల నుంచి మొదలు పెడితే అంతా సిద్ధం కావడానికి ఆరేడు గంటలు పట్టేది. కానీ రోజులో ఒకటి లేదా రెండు షాట్స్ మాత్రమే తీసేవాళ్లం” అని చెప్పింది కంగనా. 1875 కాలం నాటివైన క్యాప్‌లాక్ పిస్టోల్, ముజ్లే లోడెడ్ రైఫిల్స్..ఈ రెండు ఆయుధాలను ఈ సినిమా కోసం కంగనా ఉపయోగించింది. యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా వెయ్యి మంది ఫైటర్స్ పని చేశారు. దీని కోసం ప్రత్యేకంగా 200 మంది పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీళ్లు మిగిలిన 800మందికి యుద్ధం సీక్వెన్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చారు. ఏదో గ్రాఫిక్స్‌లో చూపించకుండా గుర్రాలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చారట. అందుకే ఈ శిక్షణ పూర్తి చేయడానికే 4నెలలు పట్టిందట. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈనెల 18న ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
చీరలో ఏదో పవర్ ఉంది !
చీర కట్టుకున్నప్పుడు తనకు స్త్రీనన్న భావన కలుగుతుందని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ అన్నారు. ‘‘చీర నా జీవితంలోకి చాలా ఆలస్యంగా ప్రవేశించింది. నేను గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయిని. అక్కడ చీర కట్టుకునే సంప్రదాయం లేదు. నటిని అయ్యాక చీరపై నాకు క్రమంగా ఇష్టం ఏర్పడింది. చీర కట్టుకున్నప్పుడు నా మనసు స్వేచ్ఛా విహంగమై విహరిస్తుంది.చీరలో ఏదో పవర్ ఉంది’’ అని ఢిల్లీలో టైటాన్ ‘తనేరియా’ హ్యాండ్‌లూమ్స్ షోరూమ్‌ని ప్రారంభించిన సందర్భంగా కంగనా అన్నారు. 31 ఏళ్ల కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని భంబ్లా పర్వత ప్రాంతంలో పుట్టి పెరిగారు. 2006లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. బాలీవుడ్‌కి వచ్చాకే కంగనా ఇంగ్లిష్ మాట్లాడ్డం నేర్చుకున్నారు.