కమల హసన్ ‘భారతీయుడు2’ … సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించే శంకర్, ఆ సినిమాలని థియేటర్స్‌లోకి తీసుకురావడానికి చాలా టైం తీసుకుంటాడు. ‘2.ఓ’ చిత్రం దాదాపు మూడున్నర సంవత్సరాలకి పైగానే పనులు జరుపుకుంది. అయితే ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో తన తదుపరి సినిమాని మొదలు పెట్టబోతున్నాడు శంకర్. ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నశంకర్, మేలో సినిమాను విడుదల చేయాలనే దృఢసంకల్పంతో ఉన్నట్లు సమాచారం. ‘2.ఓ’ చిత్రంసాంకేతిక సమస్యల వల్ల చాలా ఆలస్యం కావడం తో ఖర్చు భారీగా పెరిగి పోయింది. సినిమా ప్రారంభించిన నాలుగేళ్ళకు విడుదలయ్యింది. పెరిగిన బడ్జెట్ కారణం గా ‘2.0’ భారీగా వసూళ్లు సాధించినా…కొన్ని చోట్ల వర్కవుట్ కాలేదు.ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ‘భారతీయుడు 2’ షూటింగ్ పక్కా ప్రణాళికతో నాలుగు నెలల్లోనే పూర్తి చెయ్యాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు.
కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18న పొల్లాచ్చిలో ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్లో కమల్‌హాసన్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. పొల్లాచ్చి అనంతరం ఉక్రెయిన్‌లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రాచీన యుద్దవిద్యల్లో ఆమె శిక్షణ తీసుకుంటున్నది. కమల్‌హాసన్, శంకర్ కలయికలో 1996లో విడుదలైన ఇండియన్ సినిమాకు సీక్వెల్ ఇది. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ పాత్ర ప్రయోగాత్మకంగా ఉండనున్నట్లు తెలిసింది. తన కెరీర్లో ఇండియన్-2 చివరి సినిమా కావచ్చునని కమల్‌హాసన్ ఇటీవలే ప్రకటించారు. చిత్రంలో యువకుడు, వృద్ధుడు రెండు పాత్రలలో కమల్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇండియన్ తర్వాత కమల్ రాజకీయాలతో బిజీ కానుండగా, శంకర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.