‘తమిళ స్టార్’ హీరో కమల్ హాసన్, ‘ఆస్కార్ అవార్డ్’ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ గతంలో పలు ప్రాజెక్ట్ ల కోసం కలిసి పని చేశారు.ఇద్దరు లెజండరీలు ఒక సినిమా కోసం పని చేస్తే ఆ సినిమాపై ఎంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని తొలిసారి కమల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కి రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కమల్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… లెజండరీ నటుడు కమల్ హాసన్, లైకా ప్రొడక్షన్ సంస్థతో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నాడు. ఈ మూవీ చిత్రీకరణను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
కమల్ కలల ప్రాజెక్ట్ ‘తలైవన్ ఇరుక్కిరన్’. ఈ చిత్రాన్ని 2015లో చేస్తున్నట్టు ప్రకటించాడు. కాని మధ్యలో ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి ఊసే లేదు. తాజాగా ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కమల్ స్వీయ దర్శక నిర్మాణంలో చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని రాజ్ కమల్ ఇంటర్నేనల్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది. కమల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ చిత్రం చేస్తున్నాడు. కమల్ – రెహమాన్ కాంబో 2000వ సంవత్సరంలో రూపొందిన ‘తెనాలి’ సినిమా కోసం పని చేశారు. మళ్లీ 19 ఏళ్ళ తర్వాత వారి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంపై అభిమానులలో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి