`ఆదిత్య మ్యూజిక్` అనేది సంస్థ మాత్రమే కాదు. అది ఒక బ్రాండ్. సంగీత ప్రియులందరికీ ఆదిత్య మ్యూజిక్‌తో ఉన్న అనుబంధం అత్యంత ప్రత్యేకమైనది. గత మూడు దశాబ్దాలుగా సంగీత రంగంలో తనదైన ముద్రవేసిన ఆదిత్య మ్యూజిక్ తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో నిర్మించబోతున్న తమ తొలి సినిమాకు హీరోగా నందమూరి కల్యాణ్‌రామ్‌ను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది `118` సూపర్ సక్సెస్‌తో జోరుమీదున్నారు కల్యాణ్‌రామ్. ఆయన హీరోగా నటించనున్న ఈ సినిమాకు జాతీయ పురస్కారాన్ని అందుకున్న `శతమానం భవతి` చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మధ్యనే `ఎఫ్2`తో `హనీ ఈజ్ ద బెస్ట్` అనే మ్యానరిజమ్‌తో మార్కులు కొట్టేసిన నార్త్ ఇండియన్ భామ మెహరీన్ నాయికగా నటించనున్నారు. `జెంటిల్మన్`, `సమ్మోహనం` వంటి అభిరుచి గల హిట్ చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ సినిమాకు, `గీత గోవిందం`, `మజిలీ` వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ చిత్రాల సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులనూ అలరించేలా దర్శకుడు కథను సిద్ధం చేసుకున్నారని చిత్ర నిర్మాత ఉమేష్ గుప్త తెలిపారు.
కల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ చిత్రం !
Renowned music company Aditya Music is a brand recognized by many & are the music giants in the industry. After being in the business for nearly three decades, the organisation is now set to venture into film production.
They have teamed up with Nandamuri hero Kalyan Ram for their debut production.
After the success of his earlier film 118, Kalyan Ram is on a roll and is set to team up with National Award winning director Sateesh Vegesna of Shatamanam Bhavathi fame on this one.
Starring Mehreen Kaur Pirzada as the female lead, the film is to be presented by Sivalenka Krishna Prasad of Sridevi Movies, who have earlier bankrolled films like Gentleman and Sammohanam.
Musician Gopi Sunder who has back-to-back hits in the form of Geetha Govindam and Majili will score tunes for the film.
Speaking about this project, producer Umesh Gupta said, “This film will be a treat to the audiences of all categories and will be a universal film everyone can enjoy.”