అవయవదానం చేసిన క‌ళ్యాణ్ దేవ్

‘మెగాస్టార్’ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్… పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అవయవదానం చేసారు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ చేస్తూ.. రెండో సినిమాతో బిజీగా ఉన్న కళ్యాణ్ దేవ్ అపోలో హాస్పిట‌ల్స్ తో అగ్రీమెంట్ పై కూడా సైన్ చేసారు.
 
క‌ళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. “నా అవ‌య‌వాలు దానం చేయాల‌ని నేను ప్ర‌తిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజును నేను ఎంచుకోడానికి నేనెప్పుడూ గుర్తుంచుకోడానికి మాత్ర‌మే. ఆన్ లైన్ లో ఆర్గాన్స్ దానం చేయ‌డానికి కేవ‌లం ఒక్క నిమిషం మాత్ర‌మే ప‌డుతుంది. ఇలాంటి అద్భుత‌మైన నిర్ణ‌యం తీసుకునే ముందు ఒక్క‌సారి మ‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు చెబితే క‌చ్చితంగా వాళ్లు కూడా మ‌నం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని గౌర‌వించ‌డ‌మే కాదు సంతోషిస్తారు కూడా. సమయం వచ్చినప్పుడు అవయవాలను దానం చేయాలనే కోరికను నెరవేరుస్తున్న వాళ్ల‌లో మీరు కూడా ఒకరు అవుతారు. ఓ అంధుడు తొలిసారి ఈ లోకాన్ని మ‌న వ‌ల్ల చూస్తాడు అనే ఓ ఆలోచ‌నే నాకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మ‌రొక‌రికి జీవితాన్నిచ్చే అద్భుత‌మైన మ‌నిషిగా నేను మారాల‌నుకుంటున్నాను. ఈ య‌జ్ఞంలో మీరు కూడా భాగం కండి.. ఈ లోకాన్ని విడిచి వెళ్లేట‌ప్పుడు ఎవ‌రూ ఏమీ తీసుకెళ్లం” అని చెప్పారు.
రెండో సినిమాతో బిజీగా ఉన్నారు క‌ళ్యాణ్ దేవ్. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. పులి వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తైపోయింది. మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిజ్వాన్ ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ లుక్ విడుద‌ల చేసారు.
 
న‌టీన‌టులు:
క‌ళ్యాణ్ దేవ్, రాజేంద్ర ప్ర‌సాద్, న‌రేష్ వికే, పోసాని కృష్ణ ముర‌ళి, ప్ర‌గ‌తి
 
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: పులి వాసు
నిర్మాత‌: రిజ్వాన్,బ్యాన‌ర్: రిజ్వాన్ ఎంట‌ర్టైన్మెంట్,కో ప్రొడ్యూస‌ర్: ఖుర్షీద్ (ఖుషీ)
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్,ఎడిట‌ర్: మార్తండ్ కే వెంక‌టేష్,ఆర్ట్ డైరెక్ట‌ర్: బ‌్ర‌హ్మ క‌డ‌లి
కో డైరెక్ట‌ర్స్: డి రాజేంద్ర‌, ర‌వి,లిరిక్స్: KK