కాజల్ అగర్వాల్ తన పని తాను చేసుకుపోతూ… మూవీ పూర్తయిపోతే దాని గురించి పెద్దగా ఆలోచించదు. ఆమె చాలా ప్రొఫెషనల్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ భామ దాదాపు 30 లక్షలు వసూలు చేసిందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ రెండు సినిమాలను వద్దనుకొని ఐదు కోట్ల రెమ్యునరేషన్‌ను వదులుకుందని అనుకుంటున్నారు. కమర్షియల్‌గా ఉండే కాజల్ ఇంత మొత్తాన్ని వద్దనుకోవడం పెద్ద విషయమే. అయితే తన కెరీర్ విషయంలో తీసుకునే జాగ్రత్తల్లో భాగంగానే ఇలా చేసిందని తెలిసింది.
అసలేం జరిగిందంటే… ఇటీవల ఓ సినిమా కోసం దర్శకుడు పి.వాసు ఆమెను సంప్రదించాడట. సినిమా స్టోరీ నచ్చేసినా ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ ఆఫర్‌ను వద్దనుకుందట. 2.5 కోట్ల పారితోషికం ఇస్తామన్నా కూడా ఆ సినిమా చేయనని చెప్పేసిందట. అలాగే కోలీవుడ్‌కు చెందిన ఓ బడా ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఇంతే మొత్తానికి ఇదే తరహా ఆఫర్ వచ్చిందని అంటున్నారు. అయితే వాళ్లకు కూడా అదే సమాధానమిచ్చి పంపేసిందట కాజల్. వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొని కెరీర్ చివరి దశకు వచ్చేసిందని అనుకుంటున్న సమయంలో… ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి వరుస హిట్లతో దూసుకుపోతోంది ఈ భామ. ‘జనతా గ్యారేజ్’లో హుషారైన ఐటమ్ సాంగ్, చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’తో బ్లాక్‌బస్టర్, ‘నేనే రాజ్ నేనే మంత్రి’తో సూపర్ హిట్, ఇటీవల తమిళ్లో ‘వివేగం’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకొని కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది . ఇలాంటి సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆమె ఆ ఆఫర్లను తిరస్కరించి …ఐదు కోట్ల పారితోషికాన్ని కాదనుకుందట .