సినిమా రంగుల ప్రపంచంలో నటులు,నటిమణులు ముఖానికి రంగులేసుకుని అందరికీ వినోదం పంచుతారు.ఈ రంగుల ప్రపంచంలో నటిమణులు ముఖానికి మేకప్ లేకుండా కెమెరా ముందుకు రావడం కష్టమే.అలాంటిది తన అందం, అభినయంతో అగ్ర కథానాయికగా రాణిస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేకప్ లేకుండా దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా కాజల్ తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో ట్వీట్ చేశారు…
“మేకప్ లేని ఫొటో షేర్ చేయడానికి ధైర్యం కావాల”ని ఆమె అన్నారు. “మేకప్, అలంకరణ.. బాహ్య ప్రపంచానికి మనని అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించదు కదా?” అని నటి కాజల్ అగర్వాల్ అన్నారు. “మనల్ని మనం స్వీకరించడంలోనే నిజమైన ఆనందం ఉంద”ని కాజల్ ట్వీట్ చేశారు. “అందం అంటే మనల్ని మనం స్వీకరించుకోవడ”మని కాజల్ ఈ ఫొటోలకు క్యాప్షన్‌గా రాశారు. కాజల్ ధైర్యానికి పలువురు సినీ ప్రముఖులు.. పెద్ద సంఖ్యలో నెటిజన్లు అభినందించారు.
అవకాశాల కోసం సహనంతో వేచి ఉండాలి !
“అభిమానులకు తాను నచ్చానని, ఒక నటిగా ఇంకా తనను తాను ఎలా మెరుగుపరచుకోవాలని ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. తన వరకూ అభిమానుల అభినందనలే ముఖ్యం.అందుకోసం ఇంకా శ్రమించడానికి తయార్”.. అని కాజల్‌అగర్వాల్ చెప్పింది
“మనసులో దృడమైన విశ్వాసం ఉంటే ఏదైనా జరిగి తీరుతుందన్నారు. శ్రమించే గుణం, సహనం ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చునని పేర్కొన్నారు. సినిమా రంగంలో తృప్తి అన్నది ఎవరికీ ఉండదని.. మనం ఆశించిన అవకాశాలు రాకపోయినా సహనంగా వేచి ఉండాల”ని అన్నారు.అలాంటి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉందని చెప్పింది.తన వరకూ కథానాయకి ప్రధానంగా ఉన్న పాత్రలను ఆశిస్తున్నానని చెప్పారు. కాస్త ఆలస్యమైనా అలాంటి పాత్రలకే ప్రాధాన్యత నివ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అదే విధంగా సినిమాల్లోనే కొనసాగాలన్నది తన కోరిక” అని కాజల్‌అగర్వాల్ చెప్పింది