కాజల్ సినిమా రంగానికొచ్చి దశాబ్దం దాటినా ఇంకా ఫుల్ స్పీడ్ మీదుంది. ఇలా సుదీర్ఘ కాలం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్‌లలో కాజల్ ఒకరు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది కాజల్. ‘చందమామ’తో మొదటి హిట్ అందుకుంది. ఆ తరువాత ‘మగధీర’ సినిమాలోని మిత్రవింద పాత్రతో కాజల్ అగ్ర కధానాయికగా మారిపోయింది. ఆపై కాజల్ వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిస్తూ తిరుగు లేని కథానాయికగా కొనసాగింది. ఇదిలా ఉండగా, కాజల్ పుట్టిన రోజు జూన్ 19.ఈ సందర్భంగా… కాజల్ ఫుల్ హవా నడిచింది. సోషల్ మీడియా మొత్తం హోరెత్తించింది. ఆమె ఫ్యాన్స్ బర్త్‌డేను ఓ రేంజ్‌లో సెలెబ్రేట్ చేశారు. సమంతను వెనక్కి నెట్టి.. ‘బర్త్‌డే ట్రెండ్’లో కాజల్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే సమంత, అనుష్క, కీర్తి సురేష్‌లను దాటి మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు సమంత (254), అనుష్క (156), కీర్తి సురేష్‌లు (91.5) మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. కాజల్ 260లతో టాప్ ప్లేస్‌లోకి వచ్చింది.
రీసెర్చ్ చేయాలని ఉంటుంది!
కథానాయిక కావడానికి ముందు కాజల్ వ్యోమగామి కావాలనుకుంది. కాలం కలిసిరాక కథానాయిక అయ్యాననీ, నాయికగా కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నాననీ ఆమె తరచూ చెబుతుంది. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఏం చేస్తారు అనడిగితే.. ‘‘సెట్‌లో ఉంటేనే సినిమా గురించి ఆలోచిస్తా. ఇంటికొస్తే నా ప్రపంచం వేరు. నా ఆలోచనలు మొత్తం మారిపోతాయి. పుస్తకాల్లో ఏదన్నా కొత్త విషయం చదివితే దానికి సంబంధించి తెలుసుకోవాలని, దాని మీద రీసెర్చ్ చేయాలని ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చాలా చేశా. కానీ ఫలితం దక్కలేదు. వంట చేసే విషయంలో మాత్రం కొత్తగా ఏది ప్రయత్నించినా అది బాగానే వస్తోంది ’’ అని కాజల్ చెప్పారు.
అన్నింటికంటే ముఖ్యమైనది !
‘‘మనం హాయిగా బతకడానికి ఏవేవో కావాలనుకుంటాం. కానీ అంతిమంగా కావాల్సింది మానసిక ప్రశాంతతే. అది ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా చిన్నతనంలో అన్ని సౌకర్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నవాళ్లను ఆరాధనాభావంతో చూసేదాన్ని. కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ‘మానసిక ప్రశాంతతే అన్నింటికంటే ముఖ్యమైనది’ అని అర్థం అయింది. ఎటువంటి ఒత్తిడిలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎన్ని ఉన్నా ప్రశాంతత లేకపోతే ఏం లాభం?’’ అన్నారు కాజల్.
కాజల్ ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఎంపికైంది. ఆమె కమల్ హాసన్ తో ‘భారతీయుడు2’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’ లో, హిందీలో ‘బొంబాయి సాగా’లో నటిస్తోంది. కాజల్ చేసిన వెబ్ సిరీస్ లైవ్‌టెలిక్యాస్ట్ త్వరలో ప్రసారం కానుంది.