“కరోనా వల్ల ఫిలిం, టెలివిజన్ ఇండస్ట్రీలు బాగా దెబ్బతిన్నాయి. అదే టైమ్ లో ఓటీటీ వచ్చి టీవీని, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని అధిగమించింది. చాలా మంది ఇళ్లలో ప్రశాంతంగా కూర్చొని ఓటీటీలో సినిమాలు చూడ్డానికి అలవాటు పడ్డారు.ఇది థియేటర్లకు మంచిది కాదు “…అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.
“సినిమా థియేటర్ అనుభవం పూర్తిగా కనుమరుగైపోతుందని నేను భావించడం లేదు. అదెప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయో… అప్పుడు, ప్రేక్షకులు ఓటీటీని పక్కనపెడతారని అనుకుంటున్నాను. ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులు తాత్కాలికం. ఎప్పటికైనా ఇండియాలో ఓటీటీపై థియేటర్లదే ఆధిపత్యం” అని చెబుతోంది.
అయితే, ఓటీటీ రాకతో ఓ వైపు ప్రయోగాలు చేయడానికి అవకాశం దక్కిందంటున్న కాజల్, మరోవైపు ఇదే ఓటీటీ థియేటర్ వ్యవస్థను మింగేసిందని అభిప్రాయపడుతోంది. థియేటర్ వ్యవస్థతో పాటు ఓటీటీ కూడా ఉండాలని కోరుకుంటోంది. సిల్వర్ స్క్రీన్ పై చేయలేని ప్రయోగాల్ని తను ఓటీటీలో చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ డ్రామా చేసి.. త్వరలోనే మరో ఓటీటీ వెంచర్ తో ప్రేక్షకుల ముందుకొస్తానంటోంది. ఇప్పటికే ‘హే సినామిక, కరుంగాపియమ్,ఘోస్టీ’ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేశారు కాజల్.
‘ఉమా’అందమైన అనుభూతిలో పడేసింది… కాజల్‌ని చూసి ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతున్నారు. ముఖ్యంగా పెళ్లైన తర్వాత కాజల్ ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా కాజల్ ఫాంటసీ కథాంశంతో తెరకేక్కబోతున్న కొత్త చిత్రం “ఉమా” సినిమా కోల్‌కతాలో షూటింగ్ లో పాల్గొంది. దాదాపు 45 రోజుల పాటు జరగనున్న “ఉమా” షూటింగ్ షెడ్యుల్ లో షూటింగ్ ముగిసింది. తధాగత సింఘ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రెమ్యునరేషన్‌గా ఆమె రెండు కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ‘ఉమ’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా కాజల్ భావోద్వేగానికి లోనయ్యారు… ‘‘ఈ సినిమాలో నటించడం ఓ అందమైన అనుభవం. దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు..అందరూ అద్భుతం. కొన్ని పాత్రలు అయితే.. మీతో అలా ఉండిపోతాయి. ఉమ అయితే నన్ను ఓ అందమైన అనుభూతిలో పడేసింది. ఈ సినిమాలో మనసు ఉంది’’ అని కాజల్ ఇన్‌స్టాగ్రామ్ స్టాటస్‌లో పేర్కొన్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని కోల్‌కతాలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశారు.
నాగ్- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో కాజల్ వేశ్యగా కనిపించనుందట. స్పైగా కనిపిస్తూనే ఉగ్రవాదుల సీక్రేట్స్ తెలుసుకునే వేశ్యగా కనిపించే పాత్ర ఇది అని అంటున్నారు.