“సానుకూల దృక్పథంతో ఆలోచించడమే తన గ్లామర్ రహస్యమ”ని చెప్పింది కాజల్ అగర్వాల్. “కాలంలో వెనక్కి ప్రయాణించే అవకాశం దొరికితే 1960ల్లోకి వెళ్లిపోవాలనుంద”ని చెప్పింది కాజల్. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది… ఫ్యాన్‌వార్‌పై అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..”ప్రతి ఒక్కరూ ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి. విద్వేషంతో మనసు కల్మషం చేసుకోవడం శ్రేయస్కరం కాదు” అని చెప్పింది. “కెరీర్‌లో సాధించాల్సింది ఎంతో ఉంది.. ఇప్పుడే సినిమాల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనుభూతి కలుగుతుంద”ని పేర్కొంది. ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి క్రమశిక్షణతో శ్రమిస్తానని తెలిపింది.
పాప్‌సింగర్ బియాన్సీ నా అభిమానగాయని.క్రికెటర్లలో ధోనీ, విరాట్ కోహ్లి ఆటను ఎంజాయ్ చేస్తాను. ‘మార్వెల్’ సినిమాలో అవకాశం వస్తే కరోల్ డెన్వర్స్ పాత్ర చెయ్యాలనుంది. విజయ్ దేవరకొండ సినిమాల్ని ఎంపికచేసుకునే తీరు, నటనలో కనబరిచే వైవిధ్యత నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగే లక్షణాలున్న ప్రతిభావంతుడైన నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పింది కాజల్. కుదిరితే తప్పకుండా ఎన్టీఆర్‌తో మరో సినిమా చేస్తానని అంది. ప్రస్తుతం ‘ముంబయి సాగా’, ‘ఇండియన్-2’, ‘కాల్‌సెంటర్’ సినిమాల్లో నటిస్తున్నానని ట్విట్టర్ ద్వారా బదులిచ్చింది.
మైకం కమ్మినంత పని అయ్యింది
కాజల్ అగర్వాల్‌కు ఇటీవల కోలీవుడ్‌లో జయం రవితో చేసిన ‘కోమాలి’ చిత్ర విజయం నూతనోత్సాహానిచ్చింది.’విశ్వనటుడు’ కమలహాసన్ సరసన ఇండియన్-2 చిత్రంలో నటిస్తుండటం ఆమె ఆనందానికి మరో కారణం. కాజల్ మానసికోల్లాసానికి మరో కారణం ఉంది…. ‘ప్రేమకు చిహ్నం’ అయిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కాజల్ అగర్వాల్ సందర్శించింది. తాజ్‌మహల్ అందాలను చాలా దగ్గరగా చూడడంతో చాల ఆనంద పడిపోయిందట…
“తాజ్‌మహల్‌ను చూసి మైమరచిపోయాను. మైకం కమ్మినంత పని అయ్యింది. ఆ అద్భుతాన్ని తిలకించి పులకించిపోయాను. తాజ్‌మహాల్ అందాల గురించి ఇది వరకే విన్నాను. ఇప్పుడు ఆ కట్టడాలు.. దాని చరిత్ర నన్ను గతంలోకి తీసుకెళ్లాయి. ఇది నా జీవితంలో మరచిపోలేని అనుభవం” అని కాజల్ పేర్కొంది. కాజల్ తాజ్‌మహాల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ (బాలీవుడ్ ‘క్వీన్’ రీమేక్) త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కమలహాసన్‌తో ‘భారతీయుడు-2’లో రొమాన్స్ చేస్తున్న కాజల్‌కు మరోసారి సూర్యతో చేసే అవకాశం రానుందట.