శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో “ఆటో రజిని” చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంది. శ్రీనివాస్ జొన్నలగడ్డ ఫిలిమ్స్, శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, ప్రీతి సేన్ గుప్తా జంటగా సావిత్రి.జె ఈ చిత్రం నిర్మిస్తున్నారు. బాపట్ల ఎం. పి నందిగం సురేష్ హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, ఆంద్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. మధుసూదన్ రెడ్డి, సిద్దార్థరెడ్డి ,గౌతంరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు జగన్ గారి జగనన్న గారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. లవ్ అండ్ యాక్షన్ మూవీ తీస్తున్నాము. 15 నుంచి విజయవాడలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ నవంబర్ లో సినిమా పూర్తి చేసుకుని హాలిడేస్ లో విడుదల చేస్తాం. ఇంతవరకూ నేను తీసిన సినిమా రిలీజ్ చేసుకోవడానికి భయపడేవాడిని. 30 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో అందరి హీరోలతో చేశాను చేసిన నేను సరైన సపోర్ట్ లేక నిలబడి లేక పోయాను. ఈరోజు ఇంత మంది అన్నలు నాకు సపోర్ట్ గా ఉన్నందుకు నాలో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. నా సినిమాను కచ్చితంగా రిలీజ్ చేసుకుంటాననే ధైర్యం ఉంది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు.
కొడాలి నాని మాట్లాడుతూ…“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను ఎగ్జిబిటర్స్, థియేటర్ యాజమాన్యం వారిని దృష్టిలో పెట్టుకొని సినిమా ప్రొడ్యూసర్స్ తో పేర్ని నాని గారి ఆధ్వర్యంలో చర్చలు జరుపుతున్నారు. అయితే నిర్మాతలు మా ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు చేశారు వాటిని మేం ఎంతవరకూ చేయగలమో చూసుకొని, వాటిని మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి చర్చించి అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామరస్యమైన వాతావరణంలో సమస్యను పరిష్కరిస్తాము.
ఇది నలుగురు హీరోలు ,నలుగురు దర్శకులు, నలుగురు నిర్మాతలకు సంబంధించింది కాదు ఈ ఇండస్ట్రీ. సినీ పరిశ్రమ అనేది కొన్ని వేల మందికి జీవనోపాధి కలిగించే సినీ పరిశ్రమ. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి. అదేవిధంగా ప్రజలకు కూడా అన్యాయం జరగకూడదనే తపనతో మా ప్రభుత్వం అందరిని కలుపుకొని చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేకుండా చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని చూడకుండా అందరిని బతికించాలనేది మా ప్రభుత్వం నిర్ణయం. సినీ పరిశ్రమను రక్షించడానికే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ ముందు ఉంటుంది .నలుగురికి ఇబ్బంది కలిగితే కలగచ్చు గానీ 90% మందికి మేలు జరుగుతుంది .ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఈ సినిమా నిర్మాతలకు, హీరోలకు, దర్శకులకు, టెక్నీషియన్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఈ రకమైన సౌకర్యాలు కావాలని ,మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే సినిమా ఇక్కడ తీస్తామని వస్తే తప్పకుండా మా సహాయ సహకారాలు కచ్చితంగా ఉంటుంది.
పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి ఏం చూసాడు ,మేమేమైనా చేతులకు గాజులు తొడుక్కొని కూచున్నామా? పవన్ కళ్యాణ్ అంటే అదిరిపోయే బెదిరిపోయి కంగారుపడి పారిపోయే బ్యాచ్ మాది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు .వారికి ఆంధ్రప్రదేశ్లో ప్రజల సపోర్ట్ ఉంది పైన ఉన్న భగవంతుడు సపోర్ట్ ఉంది రాజశేఖర్ గారికి అండ ఉంది. మేము ఇటువంటి ఉడుత ఉప్పులకు చింతకాయలు రాలవు.జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరించ గలిగినవాడు గాని భయపెట్ట గలుగిన మగాడు కానీ ఇప్పటివరకు ఈ భూమ్మీద పుట్టలేదని నేను పవన్ కళ్యాణ్ కావచ్చు ఆయనకు వార్నింగ్ ఇస్తునా. పేపర్ పులులకు, మీడియాకు చెపుతున్నాను. మీకు జీవితకాలం నేను టైం ఇస్తున్నా.. జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేలి మీద ఈక ముక్క కూడా ఎవడూ పీకలేరు అని అన్నారు.
బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ ” హరికృష్ణ హీరో గా మాస్ లీడర్ గా ఈ సినిమాలో నటించడం జరుగుతుంది. ఆటో రజిని అంటే నేను ఫస్ట్ చెప్పినప్పుడు.. తమిళనాడు సినిమా తెలుగులో డబ్ చేశారు అనుకున్నాను కానీ ఇందులో డైలాగ్ విన్న తరువాత తెలుగు సినిమా ఎలా ఉండాలో అలా మంచి చిత్రం తీస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి శ్రీనివాస్ అన్నకు ,హరికృష్ణ కు భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలి.తనకు “ఆటో రజని” మంచి హీరోగా నిలబెట్టే చిత్ర మవుతుంది అన్నారు.
హీరో జొన్నలగడ్డ హరికృష్ణ మాట్లాడుతూ.. “నా మొదటి మూవీ ఆడియో కి జగనన్న గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది .ఈ “ఆటో రజిని” ఒక మాస్ సినిమా ఈ సినిమాలో నేను బై బర్త్ నుండి రజినీకాంత్ ఫ్యాన్ ని ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన మా తల్లి, తండ్రులకు ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను అన్నారు.
హీరోయిన్ ప్రీత సేన్ గుప్తా మాట్లాడుతూ ..”మాది వెస్ట్ బెంగాల్ కలకత్తా. ఇది నా మొదటి తెలుగు సినిమా ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.