జయం రవి, నివేదా పేతురాజ్ జంటగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై పద్మావతి చదలవాడ నిర్మాతగా వస్తోన్న సినిమా ‘టిక్ టిక్ టిక్’. శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. ఇండియన్ సినిమా చరిత్రంలో ఫస్ట్ స్పేస్ సినిమాగా రూపొందింది. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ- “జనవరి 1న నేను ఫ్రాన్స్ వెళ్లాను. అక్కడ ఐఫిల్ టవర్ మీద కూర్చున్నప్పుడు ఫారిన్ కపుల్ వచ్చారు. ‘మీది ఇండియానా?’ అనడిగారు. అవునని చెప్పా. అప్పుడు వాళ్లు ‘బాహుబలి’ పదిసార్లు చూశామని చెప్పారు. ఇప్పుడు మన ఇండియన్ సినిమాకి అంత గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ మనవాళ్ళు అమెరికన్ ఫిలిమ్స్ చూస్తారు. అటువంటి స్థాయిలో తీసిన సినిమా ‘టిక్ టిక్ టిక్’. ఇంతకు ముందు మేము విడుదల చేసిన ‘బిచ్చగాడు’ ట్రైలర్ ను ఎవరో పంపారు. అందులో హీరోయిన్ బిచ్చం వేసే సన్నివేశంలో ఎమోషన్ నచ్చి తెలుగులో విడుదల చేశాం. అలాగే, ఈ ‘టిక్ టిక్ టిక్’ ట్రైలర్లో చిన్నపిల్లాడు ‘డాడీ… డాడీ…’ అనే సన్నివేశంలో మంచి ఎమోషన్ కనిపించింది. తర్వాత తెలుగు హక్కులు తీసుకున్నా. అప్పుడు ఇందులో హీరో రవి, నిర్మాతలకు ఎంతో గౌరవం తెచ్చిన ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి అని తెలిసింది. ‘బిచ్చగాడు’ తరహాలో ఈ చిత్రాన్నీ ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నా. ఇటువంటి చిత్రాలని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి” అన్నారు.
హీరో ‘జయం’ రవి మాట్లాడుతూ- “సినిమా పబ్లిసిటీ కోసం రాలేదు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ సంస్థ, నిర్మాతలు సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారని చెన్నై ఫోనులు చేశారు. వాళ్లకి థాంక్స్ చెప్పడానికి వచ్చా. శ్రీనివాసరావుగారు నాన్నగారి గురించి మంచి మాటలు చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇక, సినిమా విషయానికి వస్తే.. మన దేశంలో ఫస్ట్ స్పేస్ ఫిలిం ఇది. ఇటువంటి సినిమాలను ఈజీగా చేయలేము. ఒక్కొక్క షాట్ వెనుక చాలా కష్టం ఉంటుంది. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ వచ్చి ఏ జానర్లో మనం సినిమా చేయబోతున్నామో చెప్పుకోండి అన్నారు. నేను ‘జురాసిక్ పార్క్’ అన్నాను. తర్వాత ‘స్పేస్’ ఫిలిం అనగానే అందరిలా నేనూ షాక్ అయ్యాను. ’90లలో కొన్ని స్పేస్ సినిమాలు వచ్చాయి. అలా చేయాలంటే నో ప్రాబ్లమ్. కానీ, అంతకంటే బాగా చేయాలంటే బడ్జెట్ కావాలి’ అన్నారు. లక్కీగా మంచి ప్రొడక్షన్ టీం, చెన్నైలో అజాక్స్ గ్రాఫిక్ స్టూడియో దొరికాయి. అందరూ ‘మీకు ఇటువంటి వైవిధ్యమైన సినిమాలు చేయడం ఎలా కుదురుతుంది?’ అనడుగుతున్నారు. నేను ఎందుకు కుదరదు? అంటున్నా. అందరూ నెగిటివ్ గా చూసిన విషయంలో నేను పాజిటివ్ తీసుకుని చేస్తున్నా. టీజర్, ట్రైలర్లలో ప్రేక్షకులు ఎం చూసినదాని కంటే ట్రైలర్లో పది రేట్లు ఎక్కువ ఉంది. ఇటువంటి సినిమాలను ఫోనులు, కంప్యూటర్లలో చూస్తే కిక్ ఉండదు. లార్జర్ థెన్ లైఫ్ సినిమా ఇది. థియేటర్లోనే చూడండి” అన్నారు.
చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ- “హాలీవుడ్ లో ప్రతి ఏడాది రెండు మూడు స్పేస్ ఫిలిమ్స్ వస్తాయి. కానీ, ఇండియాలో ఎవరూ ఈ పాయింట్ టచ్ చేయలేదు. స్టార్ వార్స్ టైమ్ నుంచి స్పేస్ నేపథ్యంలో ఇండియాలో ఎవరు సినిమా చేస్తారా? అనుకునేవాణ్ణి. తమిళంలో ఈ సినిమా చేస్తున్నారని తెలిసి పోటీ ఎక్కువ ఉన్నా తెలుగు హక్కులు తీసుకున్నాం. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు అజయ్, అల్లాణి శ్రీధర్ పాల్గొన్నారు. జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్, కెమెరా : వెంకటేష్, ఎడిటర్: ప్రదీప్, ఆర్ట్: మూర్తి, నిర్మాత : పద్మావతి చదలవాడ, దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.