“నాకు పేరు, ప్రఖ్యాతుల కంటే సినిమానే ముఖ్యం” అని అంటోంది జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గతేడాది ‘ధడక్’ తో మంచి విజయాన్ని అదిరిపోయే ఎంట్రీ ని ఇచ్చింది. ఆమె ప్రస్తుతం పలు ఆసక్తికర చిత్రాల్లో భాగమవుతోంది. ఈ సందర్భంగా ఓ అవార్డ్ ఫంక్షన్‌లో సినిమా, ఇమేజ్ గురించి ఆమె మాట్లాడుతూ… ‘నటీనటులకు విజయంతోపాటు కీర్తి ముఖ్యమే. వాటి కోసమే ఎంతో శ్రమిస్తారు. కానీ నాకు ఆ అవసరం లేదు. మా ఫ్యామిలీ పెద్దది కావడంతో ఆ ఫేమ్‌ని నేను చిన్నప్పుడే పొందా. నా మొదటి సినిమా తర్వాత నాకు గుర్తింపు మరింతగా పెరిగింది. ఆడియెన్స్, మీడియా నన్ను చేసిన సపోర్ట్ కి కృతజ్ఞురాలై ఉంటాను. ఇప్పుడు నాకు పేరు కంటే.. మంచి సినిమాల్లో భాగం కావడమే ముఖ్యం. ప్రస్తుతం అలాంటి నవ్యమైన చిత్రాల్లో నటిస్తున్నా’ అని తెలిపింది. జాన్వీ ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేడీ ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో గుంజన్ పాత్రలో నటిస్తుంది. దీంతోపాటు ‘తఖ్త్’లో కీలక పాత్ర పోషిస్తోంది
రోజుకి 14 గంటలు ట్రైనింగ్
శ్రీదేవి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత కష్టం అయినా పడటానికి వెనకాడేది కాదు. ఆమె కుమార్తె జాన్వీ కూడా అచ్చం తల్లిలానే ఒక పాత్ర కోసం రోజుకి దాదాపు 14 గంటలు ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇంతకీ జాన్వీని ఇంతలా కష్టపెడుతున్న ఆ పాత్ర ఏంటి అంటే? కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్న పీరియాడికల్ మూవీ ‘తక్త్’లో జాన్వీ ఈ పాత్ర చేస్తోంది. కరణ్ నిర్మాతగా జాన్వీని పరిచయం చేసిన ‘ధడక్’ హిట్ అనే విషయం తెలిసిందే.
ఇప్పుడు రెండో సినిమాకే జాన్వీకి భారీ పాత్ర ఇచ్చేశారు కరణ్. సవాల్‌గా తీసుకున్నారు జాన్వీ. పైగా రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, ఆలియా భట్, అనిల్ కపూర్ వంటి స్టార్స్‌తో ఆమె ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది జాన్వీ. అందుకే ఈ సినిమాలో తన పాత్ర కోసం శిక్షణ తీసుకుంటూ గంటల తరబడి శ్రమిస్తోంది. పీరియాడికల్ చిత్రం కాబట్టి డైలాగులు, డ్యాన్స్‌కి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అందుకే ఉదయం సుమారు 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ సమయాన్ని లెక్క చేయకుండా డ్యాన్స్ క్లాస్‌లు, డైలాగ్స్ పలకడం ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది జాన్వీ