శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వి , ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టైటిల్, మోషన్ పోస్టర్, సునీల్ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ సినిమాలోని మొదటి పాట ‘సేన జైసేన… యుద్ధం చెయ్’ అంటూ సాగే మొదటి పాటను జూన్ 23న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ‘జైసేన’ మొదటి పాటను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, దర్శకుడు వి.సముద్ర, కోప్రొడ్యూసర్ శిరీష్రెడ్డితోపాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బి.గోపాల్ మాట్లాడుతూ ”ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాన్సేప్టే చాలా ఆరుగురు యంగ్‌స్టర్స్‌తోపాటు శ్రీకాంత్, సునీల్ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు సునీల్ మాట్లాడుతూ ”సముద్ర డైరెక్షన్లో చేసిన ‘జైసేన’లో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సముద్ర కోడైరెక్టర్‌గా ఉన్నప్పుడు నన్ను ఎలా చూసుకున్నారో, ఇప్పుడూ అలాగే చూసుకుంటున్నారు. ఇందలో నేను పోలీస్ ఆఫీసర్ కారెక్టర్ చేశాను. నేను చాలా సీరియస్‌గా యాక్ట్ చేస్తుంటాను. దానికి మీ అందరికీ నవ్వొస్తుంది. నాకు డైలాగ్స్ తక్కువ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. అలాగే శ్రీకాంత్ అన్నయ్య ఓ మంచి క్యారెక్టర్ చేశారు. అప్పట్లో టి.కృష్ణగారు మంచి సందేశంతో సినిమాలు తీసేవారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన ‘రేపటిపౌరులు’ సినిమా చూశాను. రేపటిపౌరులు సినిమా చూశాను. అందులో నలుగురు పిల్లలతో చేసిన సినిమా అది. అలా ఈ సినిమాలో నలుగురు యంగ్‌స్టర్స్ ఉంటారు. సినిమా చాలా బాగుంది. డబ్బింగ్ చెప్పేటపుడు చూశాను. మంచి మెసేజ్‌తో చేసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా లో నాకోసం చందు చాలా మంచి డైలాగ్స్ రాశాడు. నాకు ఎలా చేయాలో తెలియని టైమ్‌లో సీరియస్‌గా కనిపిస్తూనే కామెడీ చేసేలా చేశాడు చందు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి డైలాగ్స్ నాకు రాయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రీతి శర్మ మాట్లాడుతూ ”నేను బెంగుళూరు నుంచి వచ్చాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. సముద్రగారు నన్ను కూతురులా బాగా చూసుకున్నందుకు థాంక్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్స్” అన్నారు.
నీతు గౌడ మాట్లాడుతూ ”సముద్రగారు మంచి హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్” అన్నారు.
ప్రవీణ్ మాట్లాడుతూ ”ఇలా ఈ స్టేజ్‌మీద ఉండి మీ అందరితో ఇలా మాట్లాడుతున్నామంటే కేవలం సముద్రగారి వల్లే. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.
అభిరామ్ మాట్లాడుతూ ”ఈ సినిమా టైటిల్‌కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. చాలా చోట్ల నుంచి అందరూ ఫోన్లు చేసి విష్ చేయడం చాలా ఆనందం కలిగించింది. మా మొదటి సినిమాలోనే పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు రిలీజ్ చేసిన జైసేన సాంగ్ కూడా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.
కార్తికేయ మాట్లాడుతూ ”టైటిల్‌కి, సునీల్‌గారి టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు రిలీజ్ అయిన జైసేన సాంగ్‌కి కూడా మంచి బూస్టప్ వస్తుందని ఆశిస్తున్నాను. రవిశంకర్‌గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఇంకా మంచి పాటలు ఉన్నాయి. ఆన్ సెట్స్‌లో మాకు ఎంతో సపోర్ట్ చేసిన సునీల్గారికి థాంక్స్” అన్నారు.
హరీష్ గౌతమ్ మాట్లాడుతూ ”ఈ అవకాశం ఇచ్చిన సముద్రగారికి థాంక్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన మోషన్ పోస్టర్‌కి, టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
వి.సముద్ర మాట్లాడుతూ ”మా గురువుగారి చేతుల మీదుగా జైసేన మొదటి సాంగ్ లాంచ్ అయింది. ఈ సాంగ్ రాసింది చందు. మా సునీల్ అన్నయ్య చెప్పిన ప్రతి డైలాగ్ చందునే రాశాడు. అన్నయ్య టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒకరోజులోనే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంత గొప్ప రెస్పాన్స్ వచ్చింది. అలాగే నాకు ఈ సినిమా విషయంలో రైట్ హ్యాండ్‌గా ఉన్న వ్యక్తి మా కోప్రొడ్యూసర్ శిరీష్‌రెడ్డి. ఇండస్ట్రీకి మంచి ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్ అవుతాడు. నా సినిమాకి ఇంత హెల్ప్ చేసినందుకు శిరీష్‌కి చాలా చాలా థాంక్స్. అలాగే దేశినేని శ్రీను మొదటి నుంచి నా కష్టాల్లో, సుఖాల్లో నా వెన్నంటి ఉన్నాడు. శ్రీను కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే టైటిల్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరి హీరోల అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకన్నా గొప్పగా పవర్‌స్టార్ అభిమానుల నుంచి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సపోర్ట్ ఉంటే ఈ సినిమా బీభత్సం సృష్టిస్తుంది. ప్రజలు బాగుండాలని పవన్‌కల్యాణ్‌గారు ఎంతో తాపత్రయపడుతూ యుద్ధం చేద్దామని ఎంత నిజాయితీగా ఉన్నాడో అలా ఈ సినిమాకి వాళ్ళందరూ అండగా ఉన్నారు కాబట్టి ఆ తర్వాత రిలీజ్ అయిన మా సునీల్ అన్నయ్య ఉన్న టీజర్ ఇంకా పెద్ద సక్సెస్ చేశారు. అలా ప్రతి స్టెప్‌లో జైసేనను సక్సెస్ చేస్తున్న అందరి హీరోల అభిమానులకు, ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌గారి అభిమానులకు థాంక్స్ చెప్తున్నాను.
ఈ సినిమా ఆడియో అత్యద్భుతంగా వచ్చింది. జైసేన లిరికల్ వీడియో త్వరలో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత విజువల్ వీడియో రిలీజ్ అవుతుంది. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన రవిశంకర్‌కి థాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన వాసు నాతో ఇంతకుముందు నాలుగు సినిమాలు చేశాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ నాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ఈ సినిమాని పూర్తి చేసి ఇంకా మరెన్నో మంచి సినిమాలు చేసే ధైర్యాన్ని నాకు ఇచ్చారు. దాన్ని మించే విధంగా ఈ సినిమాను సక్సెస్ చెయ్యబోతున్నాను. మంచివాడు అంటే కృష్ణగారి గురించి చెప్తాం. శ్రీకాంత్ కూడా అంత మంచి వ్యక్తి. సాధారణంగా షూటింగ్‌కి నెలరోజులు, పది రోజుల ముందు హీరోను కలుస్తారు. రేపు షూటింగ్ పెట్టుకొని ఈరోజు వెళ్ళి కలిశాను. ఎల్లుండి పెట్టుకో వచ్చేస్తున్నాను అన్నారు. శ్రీకాంత్ అన్నయ్యకి థాంక్స్ చెప్తున్నాను. సొసైటీ అనేది ఇలా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఇన్స్పైర్ చేస్తుంది. పొలిటికల్ లీడర్స్‌ని, యూత్‌ని, అందర్నీ ఆలోచింపజేసే సినిమా ఇది. ఈ సినిమా గొప్ప సక్సెస్ సాధించి మా అందరికీ మంచి విజయాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
రచయిత చందు మాట్లాడుతూ ”మంచితనం, మొండితనం కలిసి డైరెక్ట్ చేస్తే అది జైసేన. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, టిక్‌టాక్…ఇలా ఎన్నో యాప్‌లు ఉన్నాయి. ఏదో ఒకరోజు రైతుకోసమే శ్రమిస్తున్న జైసేన అనే యాప్ డౌన్లోడ్ చేసుకునే రోజు వస్తుంది. సొసైటీలోని అన్నిరంగాలు లాభదాయకంగానే ఉంటున్నాయి. కానీ, ఎంతో డిమాండ్ ఉన్న ఫుడ్‌ని అందించే రైతు సక్సెస్‌రేట్ ఎందుకని తక్కువగా ఉంది. అందుకే రైతును సపోర్ట్ చేస్తూ అతని కోసం పోరాటం చేస్తుంది జైసేన” అన్నారు.
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వి , ప్రవీణ్, కార్తికేయ, అభిరామ్, హరీష్ గౌతమ్, అజయ్ ఘోష్, మధు, ఆజాద్, ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్, పార్వతిచందు, పాటలు: అభినయ్ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్, డ్యాన్స్: అమ్మారాజశేఖర్, అజయ్, ఫైట్స్: కనల్ కన్నన్, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్: పి.శిరీష్ రెడ్డి, దేవినేని శ్రీనివాస్, నిర్మాత: వి.సాయి అరుణ్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వి.సముద్ర