శ్రీదేవి కూతురు పరిచయం అయ్యేది ‘వకీల్ సాబ్’తోనే

పూరి జగన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ముందు జాహ్నవి కపూరే హీరోయిన్ అని అనుకున్నారు. కానీ అందుకు జాహ్నవి అంగీకరించలేదు. ఆ తర్వాత సౌత్ మీద జాహ్నవికి అంత ఆసక్తి లేదనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటిదేమీ లేదు.. ప్రస్తుతం బిజీగా ఉన్నందువల్లే జాహ్నవి దక్షిణాది వైపు దృష్టి పెట్టలేదని బోనీకపూర్ వివరణ ఇచ్చారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యే చిత్రం పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ అని తెలుస్తోంది.‘పింక్’ రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న సోషల్ థ్రిల్లర్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన జాహ్నవి సౌత్ ఎంట్రీ ఇవ్వనుంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోనీకపూర్ కూడా ఓ నిర్మాత అనే విషయం తెలిసిందే. దిల్ రాజు ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట..
 
ముందుగా వ‌చ్చే సినిమా ‘వకీల్ సాబ్’?
‘పింక్’లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ‘వకీల్ సాబ్’ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ చెయ్యడంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇకప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక తమన్ స్వరపరిచిన ‘మగువా మగువా’ సాంగ్..’ హార్ట్ టచ్చింగ్‌గా ఉంది..
అన్నీ అనుకున్న జరిగితే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మే నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కాని లాక్ డౌన్ వకీల్ సాబ్‌ని లాక్ చేసింది. ఈయన్నే కాదు టోటల్ ఇండస్ట్రీని ఎక్కడి వాళ్లు అక్కడే అన్నట్టుగా బంద్ చేసేసింది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందిగ్థంలో పడింది.
వాస్తవానికి ఈ సినిమాను మే 15న విడుదల చేయాలనుకున్నారు. ఇక నెక్స్ట్ ఆగష్టు 15 అయితే ‘వకీల్ సాబ్’కి బిగ్ రిలీజ్ అవుతుందని భావించారు. అయితే ఆ డేట్‌కి ‘వకీల్ సాబ్’ వచ్చే పరిస్థితి ఉండదని చెప్పకనే చెప్పారు నిర్మాతలు. వకీల్ సాబ్ చిత్ర సహ నిర్మాతగా ఉన్న బోని కపూర్ కరోనా లాక్ డౌన్ ఎత్తి వేసే వరకు తమ బ్యానర్‌లో వచ్చే చిత్రాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉండవని లిఖిత పూర్వక నోట్ విడుదల చేశారు.
శుక్ర‌వారం సీఎం కేసీఆర్‌తో సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత థియేట‌ర్స్ రీ ఓపెన్‌పై కాస్త స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.ఆగ‌స్ట్‌లో తిరిగి థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌ని వినిపిస్తున్న నేప‌థ్యంలో.. ముందుగా వ‌చ్చే సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ‘వకీల్ సాబ్’ అని అంటున్నారు. దాదాపు రెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ తిరిగి మేక‌ప్ వేసుకున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వ‌కీల్ సాబ్ ముందు విడుద‌లైతే జ‌నాల‌లో జోష్ వ‌స్తుంద‌ని ఈ సినిమాని ముందుగా రిలీజ్ చేస్తార‌ని అనుకుంటున్నారు.