జాక్వెలిన్ ఫెర్నాండేజ్… ‘బాలీవుడ్లో నటించడమనేది నాకు దక్కిన పెద్ద గిఫ్ట్. కెరీర్ పరంగా నాకెలాంటి అసంతృప్తి లేదు’ అని అంటోంది శ్రీలంక అందగత్తె జాక్వెలిన్ ఫెర్నాండేజ్. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన జాక్వెలిన్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘హౌస్‌ఫుల్ 2, 3’, ‘మర్డర్ 2’, ‘కిక్’, ‘బ్రదర్స్’, ‘డిష్యూమ్’, ‘రేస్ 2’, ‘జుడ్వా 2’ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఈ సందర్భంగా తన కెరీర్ గురించి జాక్వెలిన్ ఎనాలిసిస్ చేస్తూ… ‘ఈ జర్నీ నాకొక బహుమతి లాంటిది. ఎన్నో మంచి అవకాశాలు నన్ను వరించాయి. పెద్ద దర్శకులు, భారీ చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. సక్సెస్‌తోపాటు ఫెయిల్యూర్ కూడా ఎదుర్కొన్నాను. జయాపజయాలు నా కెరీర్‌ని బ్యాలెన్స్ చేయడంతోపాటు నిలకడగా సాగేలా చేశాయి. ప్రస్తుతం నేనున్న స్థానంలో చాలా హ్యాపీగా ఉన్నా. ఈ జర్నీకి కారణం నా ఆలోచనలు, కెరీర్ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు కొత్త అనుభవం వస్తుంది. కొత్త పాఠాలెన్నో నేర్చుకుంటాం. జీవితానికి కొత్త దారి దొరుకుతుంది. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమే నాకు అతి పెద్ద అస్సెట్. ఇప్పటి వరకు నా కెరీర్లో ఎంతో అభిమానగణాన్ని సంపాదించాను. అందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని తెలిపింది.
ప్రస్తుతం ‘డ్రైవ్’ చిత్రంలో జాక్వెలిన్ నటిస్తోంది.
సీరియస్‌గా ఉంటేనే అంతిమ లక్ష్యం !
‘మీటూ ఉద్యమం వల్ల ఎప్పుడో చర్చించాల్సిన లింగ విభేదాలకు సంబంధించిన అంశం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం’ అన్నారు జాక్వెలిన్ ఫెర్నాండజ్. తాజాగా ఈ భామ కూడా ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ విషయం గురించి జాక్వెలిన్ మాట్లాడుతూ – ‘‘మీటూ’ ఉద్యమాన్ని కేవలం సినిమా ఇండస్ట్రీకే పరిమితం చేయొద్దు. మన సమాజంలో చర్చించాల్సిన అతి ముఖ్యమైన అంశం. లైంగికంగా వేధించేవాళ్లు కేవలం ఏ ఒక్క ఇండస్ట్రీలోనో కాదు ప్రతీచోట ఉన్నారు. కొన్నిసార్లు మన ఇళ్లల్లో కూడా. అలాగే ‘మీటూ’ ఉద్యమం మొదలైన ఉద్దేశం నుంచి పక్కదోవ పట్టకూడదు. సీరియస్‌గా ఉంటేనే ఉద్యమం అంతిమ లక్ష్యం చేరుకోగలం. కేవలం పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతావరణం తీసుకురావడమే కాదు. ప్రతీ చోటు స్త్రీకి సురక్షితంగా ఉండేలా చేద్దాం’’ అని జాక్వెలిన్ ఫెర్నాండజ్ పేర్కొన్నారు.