జాకీ చాన్ తాజాగా నటించిన చిత్రం `ది ఫారినర్`. మార్టిన్ కాంపెబెల్ దర్శకుడు.1992లో స్టీఫెన్ లీథర్ రచించిన `ద చైనామ్యాన్` నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వరల్డ్ వైడ్గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అక్టోబర్ 13న అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కలశ డిజిటల్ సొల్యూషన్ బేనర్ పై కలశ బాబు సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా సమర్పకుడు కలశ బాబు మాట్లాడుతూ…“జాకీ చాన్ నటించగా భారీ బడ్జెట్ లో రూపొందిన చి త్రమిది. లండన్ లో హంబుల్ బిజినెస్ మేన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హీరో ఉగ్రవాదుల దాడుల్లో తన కూతురు చనిపోవడంతో దీనికి కారణమైన వారందరినీ మట్టు బెడుతూ తన రివేంజ్ తీర్చుకోవడమే సినిమా. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందిన ఈ చిత్రం జాకీ చాన్ చిత్రాల తరహాలో ఉంటూ ఆద్యంతం అలరిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్, రిస్కీ ఫైట్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో అక్టోబర్ 13న గ్రాండ్గా విడుదల చేస్తున్నాం.