ఫారిన్లో టాలీవుడ్ సెలబ్రిటీల షోలకు అద్భుత ఆదరణ ఉంది. లైవ్ కాన్సెర్టులు.. మ్యూజిక్ షోలు.. కామెడీ షోలు విజయవంతం అవుతున్నాయి. సెలబ్రిటీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్.. సింగింగ్ ప్రోగ్రామ్స్ కి చక్కని ఆదరణ దక్కుతోంది. గాయనీగాయకులు, ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, కమెడియన్లు అందరికీ ఆదరణ అసాధారణంగా ఉంది. ఆ తరహాలోనే ఇదో కొత్త తరహా ప్రయత్నం. 25 మంది టాలీవుడ్ కమెడియన్లతో ఆస్ట్రేలియాలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
`జబర్ధస్త్ కామెడీ` షో గురించి మెల్ బా ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధి శ్రీహరి మాట్లాడుతూ-“16 మార్చి 6 పీఎం మెల్బా ఎంటర్ టైన్ మెంట్స్ ఆధ్వర్యంలో తొలిసారి ఆస్ట్రేలియాలో తెలుగువారికోసం చేస్తున్న షో ఇది. ఇంతమంది ఆర్టిస్టులతో ఆస్ట్రేలియాలో ఇలాంటి షో చేయడం ఇదే తొలిసారి. దుబాయ్ సహా ఎక్కడా ఇలాంటి వేరొక షో చేయలేదు. అక్కడ తెలుగు కమ్యూనిటీకి అతి పెద్ద ఈవెంట్ ఇది. ఛమ్మక్ చంద్ర టీమ్.. ఆది టీమ్.. సుధీర్ టీమ్ (ఈటీవీ జబర్ధస్త్ టీమ్స్) అందరూ ఈ షోలో వినోదం పండించనున్నారు. ఢీ షోలో మాష్టర్లు.. వారి తరపున పాల్గొనే 9 మంది డ్యాన్సర్లను కలుపుకుని ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం. జబర్ధస్త్ కామెడీ పేరుతో వినోదం అందించనున్నాం. పాలెస్ థియేటర్ అనే హిస్టారికల్ థియేటర్ లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీటీవీ(ఆసీస్ లో తొలి ఇండియన్ టీవీ), దోసా హట్ (ఆసీస్ లో 25 బ్రాంచీలు), కోట్ సెంటర్ ఇన్సూరెన్స్ కలిపి `మెల్ బా ఎంటర్టైన్మెంట్` పేరుతో దీనిని ప్లాన్ చేశాం. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్నాం. ఈవెంట్ లోకామెడీ .. డ్యాన్స్.. సింగింగ్ .. మ్యాజిక్ షో హైలైట్ గా ఉంటాయి“ అని తెలిపారు.యాంకర్ ప్రదీప్, వర్షిని, విష్ణుప్రియ, బిగ్ బాస్ భాను, డాన్స్ మాస్టర్ యష్ ఈవెంట్ లో పాల్గొననున్నారు.