నువ్వుల‌ వినోద్‌, ఆరోహి ‘ఇది నా సెల్ఫీ’ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

చిరుగురి చెంచ‌య్య సుగుణ‌మ్మ స‌మ‌ర్పించు శ్రీ‌చ‌ర‌ణ్ సెన్షేష‌న‌ల్ మూవీస్ ‘ఇది నా సెల్ఫీ’. సి.హెచ్‌. ప్ర‌భాక‌ర్ స్వీయ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నువ్వుల‌వినోద్‌, ఆరోహి(అనురాధ‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ్రీ‌నివాస్ మాల‌పాటి సంగీతం అందించ‌గా స‌తీష్‌గాయ్ కో- ప్రాడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ చిత్ర ఆడియోను ఫిలింఛాంబ‌ర్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌లైన సంద‌ర్భంగా… 
ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ… ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా, నిర్మాత‌గా తీసుకున్న నా సెల్ఫీ చిత్రం పాట‌లు బావున్నాయి. ఈ చిత్రంలో న‌టీన‌టులంద‌రూ బావున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ మాల‌పాటి మాట‌ల‌ను పాట‌ల‌తో, పాట‌ల‌ను మాట‌ల‌తో చెప్ప‌డం బావుంది. ఒక మంచి స్కోప్ ఉన్న సాంగ్‌. అన్ని ఎమోష‌న్స్‌తో కూడిన పాట‌లు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. మీ అంద‌రి ఆద‌రాభిమానాలు ఈ చిత్రానికి ఉండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
దేవిప్ర‌సాద్ మాట్లాడుతూ… యాక్ట‌ర్ వినోద్‌గారివ‌ల్లే నేను ఇక్క‌డ‌కు వచ్చాను. పాట‌లు రాసిన గీత ర‌చ‌యిత‌ల‌కు నా శుభాభివంద‌న‌ములు. సినిమా పిచ్చి ఉన్న‌వారు ఎవ‌రైనా స‌రే గ‌ర్వ‌ప‌డొచ్చు. అంద‌రూ ఈ చిత్రంలో చాలా బాగా చేశారు. ఈ చిత్రాన్ని చాలా ప్యాష‌న్‌తో తీశారు. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాలి అన్నారు.
సాయి వెంక‌ట్ మాట్లాడుతూ… ట్రైల‌ర్‌, సాంగ్స్ చూశాను. చాలా బావున్నాయి. రీరికార్డింగ్ కూడా బావున్నాయి. ఎస్‌.వి. రావు అంద‌రూ ఉండాల‌నుకుంటాడు. ఏప‌ని మొద‌లు పెట్టినా అంద‌రూ ఉండాల‌ని కోరుకునే వ్య‌క్తి. ప్ర‌భాక‌ర్ ఇంకా చాలా సినిమాలు తియ్యాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను అన్నారు.
‘న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ ఫిలింఛాంబ‌ర్’ అద్యక్షుడు ఎస్‌.వి.ఎన్ రావ్ మాట్లాడుతూ… ఈ చిత్రం న‌వ్యాంధ్ర ఫిలింఛాంబ‌ర్ ద్వారా విడుద‌ల కావ‌డం చాలా సంతోష‌క‌రంగా ఉంది. ఈ చిత్రాన్ని ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ రోజు ఈ స్టేజ్‌కి తీసుకొచ్చారు. చ‌ర‌ణ్ ఫ్యాన్స్ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ఈ మూవీలో న‌టించిన హీరోకి త‌ప్ప‌కుండా ఇంకా అవ‌కాశాలు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో నువ్వుల‌వినోద్‌ మాట్లాడుతూ… ఇక్క‌డ‌కి వ‌చ్చిన వాళ్ళంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు న‌న్ను హీరోగా గుర్తించి నాకు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌భాక‌ర్‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న నా దేవుడు. మా టీం అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
వీర్ క‌ర‌ణ్ మాట్లాడుతూ … ఇది నా సెల్ఫీ. ముందుగా శ్రీ‌నివాస్ మాల‌పాటిగారికి నా కృత‌జ్ఞ‌త‌లు. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఈ చిత్రానికి వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌భాక‌ర్‌గారు దేనినైనా చేయ‌గ‌ల‌రు, యాక్టింగ్‌, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ ఇలా దేన్నైనా చెయ్య‌గ‌ల‌రు.
హీరోయిన్ ఆరోహి మాట్లాడుతూ… ఇక్క‌డ‌కు వ‌చ్చిన వాళ్ళంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. మీ అంద‌రికీ ఈ చిత్రం న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. మీ అంద‌రి స‌పోర్ట్ ఈ చిత్రానికి కావాలి అన్నారు.
డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ… న‌న్ను వెన్ను త‌ట్టి ఇంత దూరం న‌డిపించిన మా కో ప్రొడ్యూస‌ర్ గారికి నా కృత‌జ్ఞ‌త‌లు ఈ రోజు ఆయ‌న ఇచ్చిన ప్రొత్సాహంతోనే ఇంత దూరం వ‌చ్చాను. అన్న ‘డైన‌మిక్ టైగ‌ర్’ న‌వ్యాంధ్ర ఛైర్మెన్‌గారికి మ‌మ్మ‌ల్ని ఇంత స‌పోర్ట్ చేస్తున్నందుకు నా కృత‌జ్ఞ‌త‌లు. మాల‌పాటిశ్రీ‌నివాస్‌, ల‌క్కీ, శ్రీ‌కాంత్, హీరో, హీరోయిన్ ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి కార‌ణం . ఇది నా సెల్ఫీ అన‌గానే అంద‌మైన సెల్ఫీల గురించి మూవీ అనుకుంటారు. కానీ సెల్ఫీల వ‌ల్ల జ‌రిగే అన‌ర్ధాలు, సెల్ఫీల వ‌ల్ల కొన్ని జ్ఞాప‌కాల‌ను తీసుకుని చేసిన మూవీ ఇది. మా చిత్రం స‌మాజానికి మంచి మెసేజ్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.
 
ఇంకా ఈ చిత్రంలో సానియా, అనూష‌, బిహెచ్ఎల్ ప్ర‌సాద్‌, కె.శ్రీ‌నివాస‌రావు, పి.సుబ్బారెడ్డి, పి.స‌తీష్‌గాయ్‌, సి.హెచ్‌.ప్ర‌భాక‌ర్‌(చ‌ర‌ణ్‌) సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.