ఈసినిమా సక్సెస్‌ కాకుంటే నా పని అయిపోయేది!

ఇప్పటికే ‘కాబిల్‌’లో అంధుడి పాత్ర చేశాను. దాన్ని ప్రేక్షకులు ఆదరించలేదు. ఇప్పుడు మేథమెటిషీయన్‌ ఆనంద్‌ కుమార్‌ జీవిత కథ’సూపర్‌ 30’లో నటించాను. ఆ సినిమా కూడా సక్సెస్‌ కాకపోతే ఇక నా పని అయిపోయేది. నన్ను ఇక్కడ నుంచి పంపేసేవాళ్లు” అని బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అన్నారు. హృతిక్‌ తాజాగా చేసిన సినిమా ‘సూపర్‌ 30’ ఇప్పటికే విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఐదు రాష్ట్రాలు ఈ చిత్రానికి వినోదపు పన్ను కూడా రద్దు చేశాయి. బిహార్‌లో ఏటా 30 మంది పేద విద్యార్థులకు ఐఐటీలో ప్రవేశానికి ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా రూపొందింది. ఇందులో ఆనంద్‌ కుమార్‌గా హృతిక్‌ నటించారు. తాజాగా ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ …
 
నన్ను నేను విభిన్నంగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడతా. ప్రజలు ఇప్పటికే ఇష్టపడ్డ వాటిని సినిమాల్లో ప్రదర్శించేందుకు ఇగో ఫీల్‌ కాను. అది సిక్స్‌ ప్యాక్స్‌, ఏబ్స్‌.. ఇప్పుడు చేసిన ఆనంద్‌ లాంటి క్యారెక్టర్‌ అయినా. అవన్నీ మరిచిపోతా. మంచిగానో, చెడుగానో ఆవిష్కరించుకోవడమే ఇక్కడ ముఖ్యం. నా హృదయంలో ఓ అడ్వెంచర్‌ ఉంది. ఈ సినిమా కథ విన్నప్పుటి నుంచీ నేను ఎటువంటి సినిమా చేయాలనుకున్నానో అదే దొరికిందని అనుకున్నా. వెంటనే చేసేయాలనిపించింది. వాస్తవంగా ఆనంద్‌కు, నాకు చాలా సారూప్యతలు ఉన్నాయి. అతనే నేను అని అనిపించింది. నాలోనూ ఈ లక్షణాలే ఉండాలనుకున్నా. ఆ అత్యున్నత విలువలే నన్ను ఈ సినిమా చేసేలా చేశాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు గానీ.. ఈ సినిమా ద్వారా నా హృదయం ఏం కోరుకుందో అవన్నీ సాధించాను. ఈ సినిమా పాత్రకు తగ్గట్టు సిద్ధం కావడానికి పడాల్సిన కష్టం తెలుసు. కానీ నాకు మాత్రం చాలా సులువు. ఆ ఎమోషన్‌ను ఫీల్‌ అవగలను కాబట్టి నేను రిలాక్స్‌గా ఉన్నా. పాత్రను ప్రేమించకపోతే ఏ సినిమానూ చేయలేను. ఆనంద్‌ను మాత్రం చాలా ఎక్కువ ఆరాధించా. కష్టమని తెలిసినా ఈ సినిమా చేసేలా ఆనంద్‌ నన్ను స్ఫూర్తివంతంగా, ప్రోత్సాహకంగా నిలిచారు.
 
‘సూపర్‌ 30’ చిత్రంలో నాతో చేసిన విద్యార్థుల నుంచి నేను నేర్చుకున్నది ఒక్కటే…మోర్‌ ఓపెన్‌ మైండెడ్‌గా ఉండాలని.. ప్రతిభ, జ్ఞానం, తెలివితేటలు వంటివి..కాస్త అభిరుచి ఇచ్చినప్పుడు ..భౌగోళిక, ఆర్థిక విషయాల వైపు చూడరు. అద్భుతమైన చోటే ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవే నన్ను ఓ వ్యక్తిని జడ్జి చేసే విధానం నుంచి మార్చేశాయి. ఇంకెప్పుడూ అలా జడ్జి చేయను. ఈ సినిమా నాలో చాలా బాధ్యతలను పెంచింది. ‘సూపర్‌ 30’లో విద్యార్థులను చూశాక, ఇటువంటి వాళ్లు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చారన్న విషయాలను పట్టించుకోకుండా.. వాళ్లను నా కొడుకులు యాక్సెప్ట్‌ చేసి ఎక్కువగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ విషయం నా పిల్లలకు ఇప్పటికే చెప్పాను. ఈ సినిమా గానీ విజయం సాధించకపోతే…నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.నన్ను ఇక్కడ నుంచి పంపించేసేవారు. ‘కాబిల్‌’లో అంధుడిగా చేసిన తర్వాత ‘ధూమ్‌’ , ‘క్రిష్‌’ వంటి సినిమాలు చేసి ఇప్పుడున్న ఇమేజ్‌ని చెరిపేసుకోవాలనుకున్నా. కానీ ‘సూపర్‌ 30’ చేశా. నా అదృష్టమో ఏమో కానీ విజయవంతం అయ్యింది.నేనేమీ సంబరపడిపోలేదు. ప్రేక్షకులు మా నిజాయితీని, కష్టాన్ని ప్రేమించి ఆదరించారు” అని చెప్పారు.