“కేవలం ఓ వ్యక్తి రూపంతో మాత్రమే ఈ జాబితా రూపొందలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును మాత్రమే నేను తుది తీర్పుగా భావించడం లేదు’ అని హృతిక్ చెప్పాడు. హృతిక్ రోషన్ ‘ఏషియన్ సెక్సియెస్ట్ మేల్స్ 2019’ ఆన్‌లైన్ పోల్ లో అగ్రస్థానంలో నిలిచాడు. బ్రిటిష్ ‘విక్లీ ఈస్టర్న్ ఐ’ సంస్థ ఆన్‌లైన్ పోల్ ఆధారంగా లండన్‌లో ప్రకటించిన జాబితాలో హృతిక్ మొదటి స్థానంలో నిలిచి… ‘ఆన్‌లైన్ గ్రీకువీరుడి’గా అవతరించాడు. బ్రిటీష్ ‘విక్లీ ఈస్టర్న్ ఐ’ సంస్థ వార్షిక ‘సెక్సియెస్ట్ ఏషియన్ మేల్’ గా సోషల్ మీడియాలో హాట్‌గా నెటిజన్లను ఆకర్షించే సెలబ్రిటీల పై చేపట్టిన ఓటింగ్ ఆధారంగా జాబితాను విడుదల చేసింది. దీంతో ఈ ఏడాది ‘సూపర్ 30’, ‘వార్’ బాక్సాఫీస్ హిట్స్‌తో ఉన్న ఈ 45 ఏళ్ల హీరో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. హృతిక్ రోషన్ గత పదేళ్ల నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తూ.. ఓవరాల్ ర్యాంకింగ్‌లో కూడా ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తున్నాడు.
“ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ నేను ఎప్పుడూ దీనిని పోటీగా చూడలేదు. నన్ను ఆకర్షణీయ వ్యక్తిగా గుర్తించి ఆన్‌లైన్‌లో నాకు ఓటువేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చాడు హృతిక్ మాట్లాడుతూ. “కేవలం ఓ వ్యక్తి రూపంతో మాత్రమే ఈ జాబితా రూపొందలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును మాత్రమే నేను తుది తీర్పుగా భావించడం లేదు” అని హృతిక్ చెప్పాడు. అలాగే ‘ఈస్టర్న్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్’ ఎడిటర్..ఈ జాబితా రూపకర్త అజ్సాద్ నజీర్ మాట్లాడుతూ.. ఇది గత పదహారేళ్లుగా చేస్తున్నామని, అప్పటి నుండీ.. హీరో హృతిక్‌కు నెటిజన్లు ఎక్కువ ఓట్లు వేస్తున్నారని తెలిపాడు. గ్రీకు దేవుడిని తలపించేలా హృతిక్ దేహదారుడ్యం వల్లే ఎక్కువగా ఆయనకు ఆకర్షితులయ్యారని పేర్కొన్నాడు. హృతిక్‌తో పాటు ఈ జాబితాలో షాహిద్ కపూర్ రెండవ స్థానంలో .. టెలివిజన్ నటుడు వివియన్ మూడో స్థానం..బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌లు నాలుగవ స్థానంలో..బ్రిటిష్ పాప్ స్టార్ జయాన్ మాలిక్ ఐదవ స్థానంలో ఉన్నారని నజీర్ వెల్లడించాడు.
అమితాబ్ సినిమా రీమేక్‌లో రెండోసారి
హృతిక్ రోషన్ కెరీర్‌లో పెద్ద హిట్స్‌లో ఒకటైన ‘అగ్నిపథ్’ చిత్రం… అదే పేరుతో చేసిన అమితాబ్ బచ్చన్ చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. మరో అమితాబ్ సినిమా రీమేక్‌లో తాజాగా హృతిక్ నటించబోతున్నాడని బాలీవుడ్ సమాచారం. అమితాబ్ హీరోగా 1982లో వచ్చిన ‘సట్టే పే సట్టా’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఫరాఖాన్ రీమేక్ చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. ఈ సినిమాలో నటించడానికి హృతిక్ అంగీకారాన్ని తెలిపారని ..ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని తెలుస్తోంది . త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. రోహిత్‌శెట్టితో కలసి ఫరాఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు