అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ ‘తుంబా’

దర్శన్, ధీనా, కీర్తీ పాండ్యన్ ప్రధాన తారాగణంగా సురేఖ న్యపతి సమర్పణలో ఏ రీగల్ రీల్స్ ప్రై.లి. , రోల్ టైమ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘తుంబా’. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి హరీష్ రామ్ ఎల్.హెచ్. దర్శకుడు. సురేఖ న్యపతి నిర్మాత. ముగ్గురు సంగీత దర్శకులు స్వరాలను అందిస్తున్నారు. ముగ్గురిలో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను గురువారం అనౌన్స్ చేశారు. తెలుగులో సాయి ధరమ్ తేజ్, తమిళంలో కీర్తి సురేష్, మలయాళంలో నివిన్ పౌలీ, హిందీలో పాప్ సింగర్ బాద్షా ఈ ‘తుంబా’ టైటిల్ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ లో ఉందీ వీడియో. ప్రేక్షకుల నుంచి టైటిల్ కి, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోకి అద్భుత స్పందన లభిస్తోంది.
 
ఈ సందర్భంగా నిర్మాత సురేఖ న్యపతి మాట్లాడుతూ – ” పెద్దలకూ, పిల్లలకూ… అందరికీ నచ్చే ఫాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘తుంబా’. దర్శకుడు హరీష్ రామ్ వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నత స్థాయిలో ఉంటాయి. తెరపై కనిపించే జంతువులు నిజమైనవే అనేంతలా విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్న వీడియోను గురువారం ప్రోమోగా విడుదల చేశాం. అందులో కనిపించే పులి నిజమైనదని చాలామంది అనుకుంటున్నారు. అది గ్రాఫిక్స్ ద్వారా సృష్టించినదే. ఈ ప్రోమో జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో మరిన్ని అద్భుతాలు ఉంటాయి. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం ” అన్నారు.
 
ధరణి వాసుదేవన్, జార్జ్, విజయ్, కళై తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్వరాలు: అనిరుధ్ రవిచంద్రన్, వివేక్ – మెర్విన్, సంతోష్ దయానిధి, ఒరిజినల్ స్కోర్: సంతోష్ దయానిధి, ఛాయాగ్రహణం: నరేన్ ఎలన్, కళ: సురేష్, కూర్పు: కలైవనన్ ఆర్, స్టంట్స్: యాక్షన్ 100, కాస్ట్యూమ్స్: వాసుకి భాస్కర్, పల్లవి సింగ్, ఆడియోగ్రఫీ: ఉదయ్ కుమార్ టి, వినయ్ శ్రీధర్, సౌండ్ డిజైనర్: ఆనంద్ కృష్ణమూర్తి, కలరిస్ట్: ప్రశాంత్ సోమశేఖర్, విఎఫ్ఎక్స్ క్రియేటివ్ డైరెక్టర్: విల్లవన్ కే.జీ, విఎఫెక్స్ డైరెక్టర్: శ్రీరంగరాజ్ జె, విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్; చంద్రమోహన్ జె, పీఆర్వో: నాయుడు – ఫణి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అశోక్ వి, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: మెల్విన్ సైమన్, డైలాగ్స్: రామ్ రాఘవ్, ప్రభాకరన్ ఏఆర్, దర్శకత్వం: హరీష్ రామ్ ఎల్.హెచ్., నిర్మాత: సురేఖ న్యపతి