మూడురోజుల ‘గురుప్రసాద్ కల్చరల్ ఫెస్టివల్’ తొలిరోజు మే 8 న త్యాగరాయ గానసభ లో ‘డా.అక్కినేని చలనచిత్ర సంగీత విభావరి’ తో ప్రారంభమయింది.డాఅక్కినేని సినీజన్మదిన పురస్కారం సినీ నటులు డా.గిరిబాబుకు ముఖ్య అతిథి డా.కొణిజేటి రోశయ్య గారు ప్రదానం చేశారు.’సాంస్కృతికబంధు’ సారిపల్లి కొండలరావు అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డా.కె.వి.కృష్ణకుమారి, దర్శకులు రేలంగి నరసింహా రావు, నిర్మాత యన్.ఆర్.అనురాధాదేవి పాల్గొన్నారు.తెనాలి ‘అక్కినేని ఇంటర్నేషనల్ ఫాన్స్’ వారు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించారు.గాయనీగాయకులు ఆమని, వెంకట్రావు,వి.కె.దుర్గ,సుభాష్,మురళీధర్, పవన్ కుమార్,కాటూరి దుర్గాప్రసాద్ గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ సత్కారం స్వీకరించారు. సంగీత విభావరి,సభాకార్యక్రమాలకు ‘యువకళావాహిని’ వై.కె. నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.