‘బాహుబలి’ లో దేవసేన పాత్రను తాను తప్ప మరెవరూ పోషించలేరని నిరూపించుకుంది అనుష్క. ఆ సినిమా ప్రభావంతో అలాంటి పాత్రలమీద ఆమెకు మక్కువ ఎక్కువైంది. అందుకే ‘బాహుబలి’ తర్వాత అనుష్క ‘భాగమతి’ అనే సోషియో హిస్టారికల్ మూవీకి అంగీకరించింది.గతంలో’అరుంధతి’,’రుద్రమదేవి’ చిత్రాల్లో కూడా తనకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలు పోషించి అలరించింది అనుష్క.
ప్రస్తుతం అనుష్క ఆ హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటకు రాలేదనిపిస్తోంది. ఎందుకంటే అనుష్క ప్రస్తుతం దేవసేన తరహా పాత్రలకోసం ఎదురు చూస్తోందట. ఈ కారణంతోనే తమిళ్, తెలుగులో ఒక్కసినిమా కూడా ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడామె కోరిక తీరేలా కనిపిస్తోంది. దర్శకుడు గౌతమ్ మీనన్ అనుష్క కోసం ఒక వైవిధ్యమైన కథ రాసుకున్నాడట.గౌతమ్ మీనన్ చెప్పిన కథానాయిక ప్రాథాన్యం కలిగిన ఆ కథ అనుష్కకు బాగా నచ్చిందట. కథాకథనాలు కొత్తగా అనిపించడం వలన, అలాంటి కథ గతంలో వినకపోవడం వలన అనుష్క ఈ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మితమయ్యే ఈ చిత్రంలో అనుష్క మరో టిపికల్ కేరెక్టర్ చెయ్యబోతుందని అంటున్నారు.
ఆ సినిమా చేయాల్సి వస్తే స్క్రిప్ట్ మాత్రమే చూస్తా !
ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలు వేసిన అనుష్క తన మనసులో మాట బయట పెట్టింది.అనుష్క స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ అని వేరే చెప్పక్కర్లేదు. తెలుగు- తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న ఈ అరుంధతి ఇప్పటికే కొన్ని నిలిచిపోయే పాత్రల్లో నటించింది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటినా ఇప్పటికీ అందచందాలతో యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతోంది. తమిళం, మలయాళ భాషలలోను ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే ఏ భాషలో అయిన తన స్థాయికి తగిన సినిమాలు చేయడానికి మాత్రమే ఆసక్తిని చూపుతోంది అనుష్క. అయితే మలయాళీ ప్రేక్షకులకు సినిమాలపై మంచి అవగాహన ఉందనీ, అక్కడి సినిమాల్లో కథాబలం ఉంటుందనే విషయం తాను సినిమాల్లోకి వచ్చాక అర్థమైందని చెప్పింది అనుష్క. ‘భారతీయ చలనచిత్ర పరిశ్రమ తలెత్తుకునేలా మలయాళ సినిమా చేయగలదు’ అని మా నాన్న ఓసారి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి …అని అనుష్క చెప్పుకొచ్చింది. తాను మలయాళ సినిమా చేయవలసి వస్తే స్క్రిప్ట్ మాత్రమే చూస్తానని, మిగతా విషయాలు పట్టించుకోనని పేర్కొంది.