గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా ప్రధాన పాత్రధారులుగా గాయత్రి రీల్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `అమ్మాయిలంతే..అదోటైపు`.కృష్ణం దర్శకత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించికొని త్వరలొ ఈ సినిమా విడుదలకు సిద్దమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమ్ మాట్లాడుతూ..`అమ్మాయిలంతే..అదో టైపు` చిత్రం భావోద్వేగాలే హైలెట్ గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్. డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, తన తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల, తండ్రి ప్రేమకి దూరమయ్యాననే కూతురు పడే బాధ, ఆ తరువాత జరిగే పర్యవసానల మధ్య సాగే ఎమోషనల్ కథ. దర్శకుడు కృష్ణమ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. త్వరలొనె ఆడియో విడుదల చేసి, అక్టొబర్ లొ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
“అమ్మాయిలంతే.. అదొ టైపు ” నేటి యువతరం, తల్లితండ్రుల ఆలొచనలకు తగ్గట్టుగా ఉండే చిత్రం. అన్నీ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు..
గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా, సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః శ్రీనివాస్, సాహిత్యంః పూర్ణాచారి, దర్శకత్వంః కృష్ణమ్.