గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘యు టర్న్’లాంటి హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం అక్టోబర్ 3న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా తో ప్రారంభమైంది. హై బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందే ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ముహూర్తపు షాట్‌కి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్‌రామ్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, అనీల్ సుంకర, కె.కె. రాధామోహన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ – ”శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ శ్రీనివాస్‌గారితో, పవన్‌గారితో ఫస్ట్‌టైమ్ వర్క్ చేస్తున్నాను. వారు నాకు చాలాకాలంగా తెలుసు. ఈ కధ బాగా కుదిరింది. మంచి సినిమా చేయాలనే తపన ఉన్నప్రొడ్యూసర్స్‌తో సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ‘గౌతమ్ నందా’ తర్వాత సూపర్ స్క్రిప్ట్‌తో సంపత్ నంది వచ్చారు. మళ్ళీ సంపత్‌తో వర్క్ చేయడం హ్యాపీ. తమన్నాతో ఫస్ట్‌టైమ్ సినిమా చేస్తున్నా.. మా కాంబినేషన్ స్క్రీన్‌మీద బాగుంటుందని అనుకుంటున్నాను. డిఓపి సౌందర్ రాజన్ ‘గౌతమ్ నందా’లో చాలా బాగా చూపించారు. మంచి టీమ్‌తోఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.” అన్నారు.
సంపత్ నంది మాట్లాడుతూ – ”ఈరోజు ఈ మూవీ లాంచ్ అవడానికి కారణం మా హీరో గోపీచంద్‌గారే. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా . దానికోసం చాలా రీసెర్చ్ చేశాను. గోపీగారు ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా ..తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. ఇరవై ఇదు మంది బ్యూటిఫుల్ ప్లేయర్స్ కనిపించబోతున్నారు. బలమైన కథ..విజువల్స్‌తో..ఎమోషన్స్‌తో ఈ చిత్రం చేస్తున్నాను. నా వెనకాల ఉన్న బలం చిట్టూరి శ్రీనివాస్, పవన్‌గారు. శ్రీనివాస్‌గారికి మాట ఇస్తున్నా..మీ బేనర్‌లో పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుందని. గోపీచంద్‌గారి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా సినిమా చేస్తాను” అన్నారు.
తమన్నా మాట్లాడుతూ – ”సంపత్‌నందిగారితో నా మూడో సినిమా. సంపత్‌గారితో వర్క్ కంఫర్ట్‌గా ఉంటుంది.మంచి కంటెంట్ ఉంది. గోపీచంద్‌గారితో సినిమా చెయ్యాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నా.. ఇప్పటికి మంచి టీమ్‌తో కుదిరినందుకు హ్యాపీ. నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాస్, పవన్‌గార్లకి థాంక్స్. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. తప్పకుండా మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను” అన్నారు.
నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ – ”గోపీచంద్‌గారితో సినిమా చెయ్యాలని గత చాలా ఏళ్లుగా అనుకుంటున్నాను. ఈ కథ విన్న వెంటనే ‘షూటింగ్‌కి ఎప్పట్నుంచి రమ్మంటారు’ అని అడిగారు. అంతలా హీరోగారికి ఈ కథ నచ్చింది .. డైరెక్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఏప్రిల్‌లో రిలీజ్‌చేస్తాం ” అన్నారు.
సమర్పకులు పవన్ కుమార్, డిఓపి సౌందర్ రాజన్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి…. డిఓపి: సౌందర్ రాజన్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది.