గోపిచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ‘సీటీమార్’ నిర్మించారు. తమన్నా హీరోయిన్. సంపత్ నంది దర్శకత్వంలో మాస్ గేమ్ ‘కబడ్డీ’ నేపథ్యంలో రూపొందిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నారు.
గోపీచంద్ ఆంధ్ర టీమ్ కబడ్డీ కోచ్‌గా, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటించారు. ఇద్దరూ ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త పాత్రల్లో మెప్పిస్తారు. స్పోర్ట్స్ మూవీ అంటే ఎలా ఉండాలో అదే రేంజ్లో సినిమాను రూపొందించాం. వీరితో పాటు భూమిక, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి, రీసెంట్గా విడుదలైన ‘జ్వాలా రెడ్డి’ సాంగ్, అప్సరా రాణి చేసిన స్పెషల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా సినిమాకు మణిశర్మగారి మ్యూజిక్, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ హైలెట్స్. డైరెక్టర్ సంపత్ నంది మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పర్‌ఫెక్ట్స్‌గా మిక్స్ చేసి ప్రేక్షకులన అలరించేలా సినిమాను చేశారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో వస్తున్న మా సీటీమార్ ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందని కచ్చితంగా చెబుతున్నాను’’ అన్నారు చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి.