హీరో గోపీచంద్ నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ `చాణక్య`. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుదల చేశారు.
గోపీచంద్‌తో మెహరీన్ జతగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ నెలాఖరుకి టాకీ పార్ట్ పూర్తవుతుంది. మూడు పాటలు మాత్రమే మిగిలి ఉంటాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:
గోపీచంద్, మెహరీన్, జరీనా ఖాన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తిరు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర,బ్యానర్: ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రీ పళని స్వామి
మాటలు: అబ్బూరి రవి, ఆర్ట్: రమణ వంకా, కోడైరెక్టర్: దాసం సాయి, రాజ్‌మోహన్