శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ(నూతన పరిచయం) ,నిరోషా (ప్రముఖ మోడల్ బెంగళూరు) హీరో హీరోయిన్లుగా గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “ఆధారం”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ. . గోపి గారు కొత్త కథలతో కొత్త టాలెంట్ ని బయటకు తీసుకురావాలని ఎప్పటినుంచో నాతో అనేవాడు. ఆ క్రమంలోనే ఈ “ఆధారం” సినిమాలో కూడా కొత్త నటీ నటులతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.లవ్ ఎమోషన్,థ్రిల్లర్ గా వస్తున్న ఈ “ఆధారం” సినిమా తనకు మంచి పేరు తీసుకురావాలి అన్నారు.
దర్శక నిర్మాత గోపి పోలవరపు మాట్లాడుతూ .. మరుగున పడిన మంచి టాలెంట్ ని బయటికి తీసుకు రావాలనే తపనతో ఈ సినిమా చేస్తున్నాను . ఈ సినిమాకు డైలాగ్స్, డైరెక్షన్ అన్ని నేనే రాసుకున్నా. కరోనా టైంలో కూడా మా ఆర్టిస్టులంతా మాకు సపోర్ట్ నిలిచి ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి సహాయ పడ్డారు. మా ఆధారం సినిమా నిలబడ్డానికి ముఖ్య కారకుడు హీరో భరత్ చంద్ర. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇతను మంచి హీరో అవుతాడు.హీరోయిన్ చాలా చక్కగా నటించింది .నజీర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ మీద ముందుకెళ్తుంది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ నజీర్ మాట్లాడుతూ ..ఇది నా మొదటి సినిమా ఇందులో రెండు పాటలు ఉన్నాయి .రెండు పాటలు కూడా చాలా బాగా వచ్చాయి.సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ.. స్టొరీ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రొడ్యూసర్ అన్ని గోపి పోలవరపు ఆయన మా అందరికీ ఆధారం అయ్యారు. ఈ సినిమాలో నాకు లీడ్ రోల్ ఇచ్చినందుకు గోపి గారికి నా ధన్యవాదాలు అన్నారు.
‘కలెక్షన్’ కింగ్ మోహన్ బాబు గారిని మొదటి సారి హీరోగా ‘కేటుగాడు’ సినిమా కి పరిచయం చేసిన నిర్మాత శ్రీ వల్లూరిపల్లి వెంకట్రావు గారి వారసురాలు చిరంజీవి సితార వల్లూరిపల్లి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.