ఫిబ్రవరి 9 న మోహన్ బాబు “గాయత్రి” విడుదల!

డా. మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సరసన మొదటిసారి శ్రియ నటిస్తుండటం మరో విశేషం. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా విష్ణు, శ్రియలు కలిసున్న ఓ పోస్టర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. క్రిస్మస్ కు విడుదల చేసిన గాయత్రి ఫస్ట్ లుక్ పోస్టర్ లో మోహన్ బాబు పవర్ఫుల్ లుక్ కు  విశేష  స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విష్ణు, శ్రియలు ముచ్చటైన జంటగా కనువిందు చేస్తున్న పోస్టర్ కు కూడా మంచి స్పందన వస్తుంది. ఈ పోస్టర్ ను బట్టి గాయత్రి చిత్రంలో మాస్ యాక్షన్ తోపాటు  మంచి కుటుంబ కథ కూడా ఉంటుందని అర్ధమవుతుంది. మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. అనసూయ భరద్వాజ్, నిఖిల విమల్ మరియు బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న   గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

సాంకేతిక వర్గం:
సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి, ఆర్ట్: చిన్న,
ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య.
కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్,నిర్మాత: డా. మోహన్ బాబు యమ్,

దర్శకత్వం: మదన్ రామిగాని

‘Gayatri’ looks of Vishnu Manchu and Shriya Saran
‘Gayatri’ team has unveiled yet another pleasant surprise today on the occasion of beginning of the New Year.  A poster revealing looks of Vishnu Manchu and Shriya Saran from the film is out. It’s quite contrast to the intense first look poster featuring Mohan Babu that was released for Christmas. Vishnu and Shriya appear to play an adorable pair in the film.

Interestingly, the stars are pairing for the first time. The cute poster with Vishnu braiding Shriya’s hair is sure to be embraced by family audiences. Gayatri is directed by Madan Ramigani and music is by SS Thaman. The film also features Anasuya Bharadwaj, Nikhila Vimal and Brahmanandam. Gayatri is slated hit screens on Feb 9th, 2018.

‘Gayatri’ is produced by Mohan Babu under his prestigious banner, Sree Lakshmi Prasanna Pictures and presented by Ariaana, Viviana and Vidya Nirvana.

Crew:
Music: SS.Thaman,DOP: Sarvesh Murari,Art: Chinna
Editor: MR Varma,Fights: Kanal Kannan,Choreography: Ganesh Acharya, Prem Rakshith
Co-directors: Anil Kumar K.V.S.N, Guna Nagendra Prasad, Ravi Bayyavarapu
Executive Producer: Vijayakumar.R,Producer: Dr. Mohan Babu M.
Direction: Madan Ramigani