డెఫినెట్‌గా ‘ఎంతవారలైనా’ పెద్ద హిట్‌ అవుతుంది !

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎంతవారలైనా’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియో వన్‌ మిలియన్‌ రియల్‌టైమ్‌ వ్యూస్‌ని దాటి అన్ని వర్గాల శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రం ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ రావడంతో సినిమాకి మంచి పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి.సీతారెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. సమ్మర్‌ కానుకగా మే 17న అత్యంత గ్రాండ్‌గా రిలీజవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో…
 
మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు మాట్లాడుతూ – ”రీసెంట్‌గా ‘ఎంతవారలైనా’ ఆడియో విడుదలైంది. ‘ఏహే మురారి’ సాంగ్‌ వన్‌ మిలియన్‌ వ్యూస్‌కి రీచ్‌ అయ్యింది. దర్శకుడు గురు చిందేపల్లి మా బంధువు అని ఈ సినిమా ఓకే అయ్యాక తెలిసింది. ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్‌ సీతారెడ్డి చాలా చాలా కష్టపడ్డారు. ఆయనకి సినిమాలపై ఉన్న ప్యాషనే నిర్మాతను చేసింది. నన్ను, డైరెక్టర్‌గారిని, మిగితా టెక్నీషియన్స్‌ అందర్నీ ఈ సినిమా ద్వారా హీరోలుగా నిలబెట్టే ప్రయత్నమే చేశారు తప్ప ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. పబ్లిసిటీ విషయంలో కూడా పెద్ద సినిమాలకి థీటుగా పబ్లిసిటీ చేసి సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళారు. పాటలు అద్భుతంగా రావడానికి చిక్‌మంగుళూరులోని అద్భుతమైన లొకేషన్స్‌లో తెరకెక్కించారు. అందుకు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. డైరెక్టర్‌ ఈ సినిమాను తన మొదటి సినిమాలా కాకుండా ఒక ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న డైరెక్టర్‌లా అనుకున్న బడ్జెట్‌లో అనుకున్నదానికంటే రిచ్‌గా సినిమాని తెరకెక్కించారు. సినిమా మేం అనుకున్నదానికన్నా బాగా వచ్చింది. సాంగ్స్‌కి కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. జనరల్‌గా అన్నీ లీడింగ్‌ ఛానెల్స్‌లో ప్లే లిస్ట్‌లో మా ‘ఎంతవారలైనా’ సాంగ్స్‌ స్థానాన్ని సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మూడు సాంగ్స్‌కి మూడు డిఫరెంట్‌ టైప్‌ జోనర్స్‌ నుండి చక్కటి ఆదరణ లభిస్తోంది. ఇలాగే మూవీ కూడా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా. ఫస్ట్‌ నుండి మా సినిమాకి సపోర్ట్‌ చేస్తున్న మీడియాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా” అన్నారు.
 
దర్శకుడు గురు చిందేపల్లి మాట్లాడుతూ – ”ఈ సినిమా స్టోరి సీతారెడ్డిగారికి చెప్పినప్పుడే దీనికి సంబంధించిన అన్ని లొకేషన్లు ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాను. ముఖ్యంగా సాంగ్స్‌ని మైసూర్‌, చిక్‌మంగుళూరువంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. ఇటీవల విడుదలైన మా చిత్రం ఆడియోకి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. ఇక సాంగ్స్‌ని స్క్రీన్‌ మీద చూస్తున్నప్పుడు అంతకంటే ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యేలా బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. అలాగే సినిమాటోగ్రాఫర్‌ మురళీమోహన్‌ రెడ్డి మాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ఆయన అందించిన ఫొటోగ్రఫీ సినిమాకి మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు ఒక దర్శకుడిగా నాకు ఏం కావాలో దానికి అనుగుణంగా మ్యూజిక్‌నిచ్చారు. సీతారెడ్డి నా మిత్రుడు. ఆయనకి నటన మీద ఆసక్తి ఉండటంతో ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ ఎస్‌.పి. క్యారెక్టర్‌ చేశారు. తప్పు చేస్తే ‘ఎంతవారలైనా శిక్షార్హులే’ అనే కాన్సెప్ట్‌తో రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కించాం” అన్నారు.
 
నిర్మాత, నటుడు జి.సీతారెడ్డి మాట్లాడుతూ – ”ఈ ఫంక్షన్‌ హీరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు. ఇతను లేకపోతే ఈ సినిమా ఫిఫ్టీ పర్సెంట్‌ లేదు. నేను ఇదివరకు చెప్పినట్లు ఈ సినిమాకు కథే హీరో. దానికి తగ్గట్లు అద్భుతమైన సాంగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌నిచ్చి సుక్కు మరో హీరోగా నిలిచారు. ఒక చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమాలా చాలా బాగా చేశారు. రాఘవేంద్రరావుగారి సినిమాల్లో మ్యూజికల్‌ హిట్స్‌ చాలా ఉన్నాయి. అలా ఈ సినిమా మ్యూజిక్‌ వినగానే ఆడియో ఆయన సినిమాలా ఉంటుందని, విజువల్‌గా కూడా బాగుండాలని మంచి లొకేషన్స్‌లో సాంగ్స్‌ షూట్‌ చేశాం. అన్నీ ఈ సినిమాకి బాగా కుదిరాయి కాబట్టే ఈరోజు మీ ముందు నిలబడి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మా సినిమా సాంగ్స్‌ వన్‌ మిలియన్‌ వ్యూస్‌ దాటడంతో అమెరికా నుండి కూడా నా ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి విష్‌ చేస్తున్నాను. ఈ సినిమా ద్వారా మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు బ్రేక్‌ అంటే ఏంటో చూపిస్తారు. ఆల్‌రెడీ తనకి మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. సాంగ్స్‌, వీడియో సాంగ్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఇలా ఒక ఎస్సెట్‌ కాకుండా అన్నీ ఎస్సెట్స్‌ని పూర్తిగా వాడుకొని ఈ సినిమాని అద్భుతంగా తీశాం. మీడియా మంచి సపోర్ట్‌ అందిస్తుంది. దానికి తగ్గట్లుగానే సోషల్‌ మీడియాలో వ్యూయర్స్‌ నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. ఇక డైరెక్టర్‌ గురు చిందేపల్లి సినిమా అంటే ఏమిటో చూపించారు. డెఫినెట్‌గా ‘ఎంతవారలైనా’ పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. సాంగ్స్‌ కానివ్వండి, లిరిక్స్‌గానీ, హీరోహీరోయిన్స్‌ పెర్‌ఫార్మెన్స్‌, గురు చిందేపల్లి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ఇలా ప్రతి ఒక్క క్రాఫ్ట్‌ వర్క్‌ని సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్‌ చేస్తారు. మే 17న విడుదలవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మళ్లీ కలుద్దాం” అన్నారు.