సెలూన్ లాంజ్ ఇటు సౌందర్య సాధన, అటు శరీర సంరక్షణకు సంబంధించిన అత్యుత్తమ సేవలందించే ఒక విశిష్టమైన ప్రదేశమని television ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్,నంది అవార్డు గ్రహీత, నిర్మాత, దర్శకుడు మహమ్మద్ షరీఫ్ అన్నారు.హైదరాబాద్ లోని అత్తాపూర్‌లో ఎస్సెంషియా సెలూన్ లాంజ్ ప్రొమోషనల్ వీడియో ఫిల్మ్ మరియు బ్రోచర్ ను ఆవిష్కరిస్తూ..
హైదరాబాదీ లకు సరికొత్త అనుభూతిని, అనుభవాన్ని అందించడానికి హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఈ సెలూన్ ఫిబ్రవరి 16 వ తేదీన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ రంజిత్ రెడ్డి ప్రారంభించ నున్నారని షరీఫ్ చెప్పారు.
అందం మరియు వ్యక్తి గత సంరక్షణలో సాటిలేని అనుభవముకోసం అంతర్జాతీయ బ్రాండ్ లను అత్తాపూర్ కు తీసుకువచ్చిందని అన్నారు.వీరి వద్ద ప్రత్యేకమైన కేశ సౌందర్యం, మొదలుకుని ఆకర్షణీయమైన చర్మ ఆరోగ్య పునరుజ్జీవన విధానాలు, సంపూర్ణమైన మేకప్ సేవల వరకు అన్నీ ఒకేచోట లభిస్తున్నాయని వీరి వద్ద గల అత్యాధునిక పరికరాలు మరియు సౌకర్యాలు అంతర్జాతీయ స్త్రీ,పురుష కేశసేవలు ప్రమాణాలతో కూడుకుని ఉన్నాయని చెప్పారు .ఇక్కడ జుట్టు కత్తిరింపులు, స్టైలింగ్, కలరింగ్, ఫేసియల్, చేతుల అందాన్ని తీర్చిదిద్దే పద్ధతి, పాదాలను అందంగా తీర్చిదిద్దడం, చర్మ సంరక్షణవంటి సేవలను స్త్రీ పురుషులకు ఎస్సైసెంషియా అందిస్తోందని చెప్పారు.
వీరి వద్ద ఎంపిక చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణులైన, సుశి క్షితులైన, స్నేహ పూర్వకమైన సిబ్బంది ఉన్నారు.ఇక్కడి క్రియేటివ్ టీమ్ మీ కేశాలను, చర్మాన్ని అందంగా మెరిపించేందుకు సర్వదా సిద్ధంగా ఉంటారని ప్రముఖ సినీ టీవీ నటి మరియు యాంకర్ సునీత అన్నారు.వారు మిమ్మల్ని దర్పం, సొగసు ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారని వారి సేవలు ఉపయోగించుకొండని ఆమె సూచించారు.
ప్రతి ఒక్కరి చర్మం విశిష్టమైందని, విశిష్టమైన చర్మానికి ప్రత్యేకమైన సంరక్షణ అవసరమవుతుంది కాబట్టి రకరకాల చర్మ అవసరాలకు వేరువేరు చికిత్సాపద్ధతులను ఇక్కడ సిఫారసు చేసుతున్నారు. ఈ సెలూన్ లో అందించే మూలికలతో తయారైన సౌందర్యసాధనాలతో శరీర సంరక్షణతో పాటు, మీ చర్మాన్ని మెరిపించడమే కాకుండా శరీర కణాలు కొత్తజీవం పోసుకుంటాయని చెప్పారు . మీ చర్మపు ముడుతలను తగ్గించడంలో దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. మీ చర్మంలోని ఎపిడెర్మల్ స్టెమ్ కణాలను పెంచి, అల్ట్రా వయలెట్ కిరణాల వంటి కాలుష్యం నుంచి కాపాడతాయి అని సునీత అన్నారు.
ఈ ఆధునిక సెలూన్ లో దెబ్బతిన్న జుట్టును బాగుపర్చే అన్నిరకాల సేవలు అందుబాటులో ఉన్నాయి అని ఎస్సెంషియా యజమానురాలు శ్రీమతి స్వాతి రెడ్డి చెప్పారు . అవి ప్రత్యేకమైన రీతిలో పనిచేసి ప్రబావం చూపిస్తాయని . వెంట్రుకలకు అందాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అవి సమకూరుస్తాయని ఆమె అన్నారు . కెరాటిన్, బొటాక్స్, ప్రొటీన్ ట్రీట్ మెంట్లు, వెంట్రుకలు రాలకుండా కాపాడే స్కాల్ప్ మరియు యాంటీ డాండ్రఫ్ చికిత్సలు, బాలాయెగె, సిస్టిన్, బ్రెజిల్ కెరాటిన్ రికన్‌స్ట్రక్షన్స్ వంటి అన్నిరకాల పాపులర్ కేశ సంరక్షణలు, రంగులు వేసే విధానాలు అందుబాటులో ఉన్నాయని కూడా స్వాతి రెడ్డి చెప్పారు .
మీలోని చిన్నచిన్న లోపాలు బయటకి కనిపించకుండా చేసేందుకు హెయిర్ బ్రష్ మరియు హెచ్ డీ మేకప్ టెక్నిక్స్ ఉపయోగిస్తామని . పార్టీ మరియు పెండ్లికూతురు మేకప్‌తో కట్టిపడేసే విధంగా మీ అందాన్ని హుందాగా తీర్చిదిద్దుతామని ,గోళ్లకు మెరుగులు, మీ గోళ్ల యొక్క అందాన్ని ఇనుమడింపజేసేందుకు పెయింట్, డెకొరేట్ వంటి నెయిల్ ఆర్ట్ సేవలు ఇక్కడ లభిస్తాయని, మీ గోళ్లను తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలపు మన్నిక కలిగిన మరియు అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ సెలూన్ ప్రత్యేకమైనది అని ఆమె అన్నారు .
జెల్ పాలిష్
అక్రిలిక్ ఎక్స్టెన్షన్స్
పౌడరి డిప్
క్రోమ్ పాలిష్
ఫ్రెంచ్ మరియు రివర్స్ బంచ్ (రివర్స్ మూన్)
మ్యాట్ ఎఫెక్ట్స్
క్రాకిల్ ఎఫెక్ట్స్
జెల్ మరియు అక్రిలిక్ రకాలతో కూడిన ప్రజాదరణ పొందిన, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఓంబ్రె టెక్నిక్ సేవలు కూడా సెలూన్లో లభిస్తాయని
మీ గోళ్ల పాలిష్‌ను అత్యంత జాగ్రత్తగా తొలగించి వాటిని సంపూర్ణ ఆరోగ్యంతో, సహజమైన పూర్వస్థితికి తీసుకువచ్చే సేవలు కూడా ఉన్నాయని .. శ్రీమతి స్వాతిరెడ్డి చెప్పారు.
సెలూన్ ఇంటిరియర్లు, అదునాతనమైన సీటింగ్ మీరు రిలాక్స్ అయ్యేలా రూపొందించబడ్డాయని వర్ధమాన నటుడు సోయల్ మాట్లాడుతూ.. మీరు కాఫీ లేదా జ్యూస్ తాగుతూ ఆహ్లాదకరమైన సంగీతం వింటూ ఎస్సేన్షియా సేవలను అస్వాదించవచ్చు. సాధారణంగా మగవాళ్ళు అందానికి ప్రాధాన్యం ఇవ్వరు కానీ ఈ సెలూన్ ను సందర్శించిన మగవాళ్ళు మరో పది మందికి చెప్పేలా వీరి సేవలు వుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని శ్రీ సోహెల్ చెప్పారు.