నేటి యువతకు ‘శ్రీ మహవిష్ణు మహత్యం’ తెలియజేసే ఉద్దేశ్యంతో గోవింద రాజ్ విష్ణు ఫిల్మ్స్ బ్యానర్ పై రామావత్ మంగమ్మ నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘శ్రీ రంగనాయక’. దుందిగల్ వినయ్ రాజ్ మహవిష్ణు పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ నంది వెంకట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. భక్తుడి పాత్రలో రంగాబాషా ,లంకెల అశోక్ రెడ్డి ,పండ్రాల లక్ష్మీ ,పరవాడ సత్యమోహన్, నిహారిక చౌదరి ,తన్నీరు నాగేశ్వరరావు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈమూవీ ఆడియో, ప్రీ రిలీజ్ పంక్షన్ హైద్రాబాద్ ఏ.వి కాలేజ్ లో జరిగింది. సెప్టెంబర్ 23 న రిలీజ్ అవుతున్న ఈ మూవీ పంక్షన్ లో ఏవి కాలేజ్ ప్రిన్సిపల్ సిహెచ్ .రాజలింగం, నటులు కుప్పిలి శ్రీనివాస్ ,గబ్బర్ సింగ్ సాయి ,బుచ్చిరెడ్డి ,వెంకన్న ,బాస్కర్ యాదవ్ , కరాటే గ్రాండ్ మాస్టర్ ఆర్.కె.క్రిషేనా ,ఎస్ .శ్రీనివాస్ ,సౌమ్య ,రామచంద్ర శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు.
శ్రీ మహవిష్ణు పాత్రదారి దుందిగల్ వినయ్ రాజ్ మాట్లాడుతూ.. మా శ్రీ రంగనాయక చిత్రం లో శ్రీ మహావిష్ణు పాత్రలో నటించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. దర్శకులు నంది వెంకట రెడ్డి గారు అద్భుతంగా చిత్రీకరించారని తెలిపారు.. సెప్టెంబర్ 23 న థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి ఘనవిజయం అందించాలని కోరారు
భక్తుడి పాత్రధారి రంగాబాషా మాట్లాడుతూ.. శ్రీ రంగనాయక చిత్రంలో భక్తుడి పాత్రలో నటించానని, ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు దన్యవాదాలు తెలిపారు.
నటుడు లంకెల అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ రంగనాయక చిత్ర దర్శకులు వెంకట్ రెడ్డి గారు.. దుందిగల్ వినయ్ రాజ్ గారి ని వెండితెరకు పరిచయం చేస్తున్నారు.. బిగ్ స్ర్కీన్ పై వినయ్ రాజ్ గారిని చూస్తుంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు దిగివచ్చినట్టు ఉందన్నారు.
అతిథి నటులు కుప్పిలి శ్రీనివాసరావు.. శ్రీ రంగనాయక చిత్రంలో టైటిల్ రోలో పోషించిన దుందిగల్ వినయ్ రాజ్ పాత్రలో జీవించారని అన్నారు.. చిన్న సినిమా అనుకున్నాం కానీ.. స్క్రీన్ పై చూశాక ఓ పెద్ద సినిమా ను చూస్తున్న ఫీలింగ్ కలిగిందని అన్నారు.
గబ్బర్ సింగ్ సాయి.. శ్రీ రంగనాయక చిత్రంలో మహవిష్ణు పాత్రలో నటించిన వినయ్ రాజ్ గారిని స్ర్కీన్ పై చూస్తుంటే సాక్షత్తూ శ్రీ మహావిష్ణు ని చూసిన ఫీలింగ్ కలిగిందన్నారు.. సాంగ్స్ , ట్రైలర్స్ చాలా బాగున్నాయని ఈ చిత్రం మంచి ఆదరణ పోందుతుందని అన్నారు…
డైరెక్టర్ : నంది వెంకట్ రెడ్డి, నిర్మాత :రమావత్ మంగమ్మ
కథ : నర్ల రామకృష్ణ రెడ్డి, మ్యూజిక్ : డ్రమ్స్ రాము, కెమెరా : యాదగిరి
మాటలు : ముత్యాల గణేష్, ఎడిటింగ్ : ప్రవీణ్ కుమార్ , విజయ్ కుమార్