`ఓకే.. బంగారం` సినిమాతో దుల్కర్ సల్మాన్, ఇటీవల విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమతిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా `కలి`. ఈ సినిమాను సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్.ఎ) సమర్పణలో లక్ష్మీ చెన్నకేశవ ఫిలింస్ పతాకంపై `హేయ్.. పిల్లగాడ` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.వి.కృష్ణస్వామి నిర్మాత. సమీర్ తాహిర్ దర్శకుడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా…. నిర్మాత డి.వి.కృష్ణస్వామి మాట్లాడుతూ – “ ఓకే బంగారం దుల్కర్ సల్మాన్, ఫిదా సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం `కలి`. మలయాళం,తమిళంలో సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలుగులో విడుదల `హేయ్..పిల్లగాడ` పేరుతో తెలుగులో మా లక్ష్మీ చెన్న కేశవ పిలింస్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నాం. ఇదొక టిపికల్ లవ్‌స్టోరీ. దుల్కర్, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ `యు` సర్టిఫికేట్ పొందింది. గోపీసుందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. సినిమాను ఈ అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణః సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్.ఎ), మాటలుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ, సంగీతంః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః గిరీష్ గంగాధరన్, నిర్మాతః డి.వి.కృష్ణస్వామి, దర్శకత్వంః సమీర్ తాహిర్.
‘Hey Pillagada’ censor done, release in October
How about watching Dulquer Salman and Sai Pallavi in a film. It’s coming. After ‘OK Bangaram’, the Malayalam star will be seen as a romantic hero opposite Sai Pallavi, Telugu cinema’s newest heartthrob after ‘Fidaa’.
The Malayalam hit ‘Kali’ (meaning ‘Rage’) will be released in Telugu as ‘Hey Pillagada’. The film has undergone its Censor formalities and is all set to hit the screens this very month.
DV Krishna Swamy, a prominent distributor of Ceded territory, is producing it on Lakshmi Chennakesava Films. He says, “The original, titled ‘Kali’, was a big hit in Malayalam and Tamil. This is a distinct love story. The chemistry between the lead pair is amazing. Both the young and family audiences are going to love ‘Hey Pillagada’. We are happy that our film has got a clean ‘U’ certificate. Gopi Sundar’s music and background score and Girish Gangadharan’s cinematography will be two of the major highlights.”
Directed by Sameer Thahir, the action-thriller has dialogues by Basha Sri, whereas the lyrics are by Surendra Krishna. It’s presented by Sooreddy Gopalakrishna (USA).