డా.రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఎస్వి గరుడవేగ 126.18ఎం’. జ్యో స్టార్ ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై ఎం.కోటేశ్వర్ రాజు సినిమాను నిర్మించారు. సినిమా నవంబర్ 3న విడుదలై పెద్ద సక్సెస్‌ను సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో…
ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ – “సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా విడుదలైన తొలి ఆట నుండి సక్సెస్ టాక్‌ను తెచ్చుకుంది. సినిమా విడుదలైన సాయంత్రానికల్లా సక్సెస్ రేంజ్ మాకు అర్థమైపోయింది. హాలీవుడ్ సినిమాలా ఉందని, రాజశేఖర్‌గారిని కొత్తగా చూశామని అంటున్నారు. ప్రేక్షకులు సినిమాను తమదిగా భావించారు. కంటెంట్ ఉంటే సినిమాను ఆదరిస్తామని ప్రేక్షకులు నిరూపించారు. ఈ సినిమాకు ఐదు సినిమాటోగ్రాఫర్స్ పనిచేశారు. అంటే కావాలనే కాకుండా కొన్ని కారణాలతో ఐదుగురు సినిమాటోగ్రాఫర్స్‌తో పనిచేయాల్సి వచ్చింది. శ్రీచరణ్, భీమ్స్ ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిరంజన్‌తో కలిసి కూర్చొని స్క్రిప్ట్ రాశాను. ఎడిటర్‌గారు నాలుగైదు వెర్షన్స్ చేసి మంచి అవుట్‌పుట్ బాగా రావడానికి కష్టపడ్డారు. ఇక్కడెంత కలెక్ట్ చేస్తుందో యు.ఎస్‌లో కూడా అంతే కలెక్ట్ చేస్తుంది. సివిరావు అందించిన విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. సినిమా రూపొందడంలో ప్లానింగ్ వల్ల ఏడాది సమయం పట్టిందే తప్ప, సినిమా షూటింగ్‌కు 90 రోజుల సమయమే పట్టింది. ఆదరించిన ప్రేక్ష
కులకు థాంక్స్“ అన్నారు.
డా.రాజశేఖర్ మాట్లాడుతూ – “ఈ సినిమా స్క్రిప్ట్‌ను ప్రవీణ్‌గారు ఏ ముహుర్తంలో రాశారో కానీ, నా కెరీర్లోనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంకుశం కంటే ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. అందుకు కారణమైన ప్రవీణ్‌గారికి ముందు థాంక్స్. జీవిత వల్లనే ఈ సినిమా పూర్తైంది. జీవిత ఈ సినిమాను నాకు గిఫ్ట్‌లా ఇచ్చిందని చెప్పొచ్చు. చిరంజీవిగారి థాంక్స్. ఆయన మా సినిమాను చూసి ప్రత్యేకంగా అభినందించారు. బొకే పంపించారు. చిరంజీవిగారితో మిస్ అండర్ స్టాండింగ్ వచ్చినప్పుడు మళ్లీ వెళ్లి మాట్లాడుకున్నాం. కానీ మీడియాలో తప్పుడు వార్తలు రాశారు. అలా రాస్తే ప్రజలకు తప్పుగా సమాచారం వెళ్లిపోతుంది. కాబట్టి అలా రాయొద్దు““ అన్నారు.
జీవిత మాట్లాడుతూ – “ఈ సినిమా కోసం ప్రవీణ్‌గారు ఎంతో కష్టపడ్డారు. నా జాబ్ ఇంతే అని అనుకోకుండా, ప్రతి క్షణం సినిమా కష్టం నాదే, అని ప్రవీణ్ ఆలోచిస్తూ వచ్చాడు. తనకు థాంక్స్ చెప్పడం కూడా తక్కువే. హ్యుమానిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. అటువంటి తక్కువ మందిలో ప్రవీణ్ ఒకరు. ఈ సినిమా ప్రారంభం అయినప్పుడు సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండా ఉండింది. రానా, తాప్సీ, కాజల్, మంచు లక్ష్మిగారు ఆన్లైన్లో విడుదల చేశారు. నేను ఫోన్ చేసి అడగ్గానే వెంటనే ఎస్ చెప్పి..అంగీకరించారు. అలాగే బాలకృష్ణగారిని ట్రైలర్ విడుదల చేయమని అడిగితే ఆయన వెంటనే సరేనని చెప్పడమే కాకుండా ముహూర్తం కూడా నిర్ణయించారు. మీ సక్సెస్ వచ్చినందుకు ఆనందంగా ఉందని చిరంజీవిగారు, మహేష్‌గారు, రాజమౌళిగారు సహా ఇండస్ట్రీ అంతా అభినందించారు. అందరికీ థాంక్స్“ అన్నారు.
ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ – “ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీకి వస్తారు. అలాంటి వారి ఆలోచనలకు గౌరవమిచ్చే వ్యక్తి ప్రవీణ్ సత్తారు గారు. చాలా మంచి రోల్‌ను రాశారు. డా.రాజశేఖర్‌గారు హ్యుజ్ సక్సెస్‌ను అందించారు. అందరూ ఆయన్ను కమ్ బ్యాక్ అంటున్నారు“ అన్నారు.
శ్రద్ధాదాస్ మాట్లాడుతూ – “జర్నలిస్ట్ పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. ప్రవీణ్ సత్తారు సినిమాలో రెండో సారి నటించడం ఆనందంగా ఉంది. మంచి టీంతో పనిచేయడం ఆనందంగా ఉంది“ అన్నారు.
పూజా కుమార్ మాట్లాడుతూ – “ఫెంటాస్టిక్ క్యారెక్టర్‌ను రాశారు. జీవితగారు, రాజశేఖర్‌గారు నన్ను కలిసినప్పుడు..ప్రవీణ్ సత్తారుగారు క్యారెక్టర్‌ను పోన్లో చెప్పినప్పుడు..ఒక మంచి క్యారెక్టర్ చేయడానికి ఇంత మంది అప్రోచ్ అవుతున్నారనిపించింది. సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు“ అన్నారు.
శ్రీచరణ్ మాట్లాడుతూ – “బ్యాగ్రౌండ్ స్కోర్ బావుందని అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. ప్రవీణ్‌గారు అంత విజన్‌ను ఇచ్చారు కాబట్టే నేను బ్యాగ్రౌండ్స్కోర్ను ఇవ్వగలిగాను. నాలుగు నెలల సమయం తీసుకుని బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాం“ అన్నారు.
ATT B1G1 offer for PSV Garuda Vega
Telugu movie PSV Garuda Vega 126.18M which released last week has received rave reviews and is running to housefull shows has achieved a no mean feat for a Telugu movie. It raked in Quarter Million Dollars in less than 3 days and is now inching towards Half a Million in US. Due to huge demand from audience, this movie is being released in new countries too. Within US, the screen count is being increased for the second week from the already released 80+ locations, which reflects the craze for this movie in public. Sunday boxoffice collections for this movie has been on par with Friday’s number which hints at a bigger second week. Many shows in US are sold out and people who went to theater without an advance booking had to return home due to soldout shows. Watch this stylish thriller on big screen with friends and family at a discounted price with AT&T Tuesday offer. You can also use Moviepass, Fandango B2G1 if you are not an AT&T user. Dont miss it. Go watch this visually wonderful, edge of the seat thriller.